తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బిహార్​లో హోరాహోరీ- పిక్చర్​ అబీ బాకీ హై! - బిహార్​లో ఎన్​డీఏ గెలుపు

బిహార్​లో అధికార ఎన్​డీఏ, మహాకూటమి మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. ఇద్దరి మధ్య వ్యత్యాసం చాలా తక్కువగా ఉంది. ఇంకా లెక్కించాల్సిన ఓట్లు చాలా ఉండటం వల్ల గెలుపుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Bihar
బిహార్​లో హోరాహోరీ.. పిక్చర్​ అబీ బాకీ హై

By

Published : Nov 10, 2020, 7:09 PM IST

Updated : Nov 10, 2020, 7:29 PM IST

బిహార్​ అసెంబ్లీ ఎన్నికల సమరంలో ఎన్​డీఏ, మహాకూటమి మధ్య పోరు నువ్వా-నేనా అనేలా ఉంది. ఆర్​జేడీ నేతృత్వంలోని మహాకూటమిపై ఎన్​డీఏ స్వల్ప ఆధిక్యాన్ని కనబరుస్తోంది. అయితే రెండు కూటముల మధ్య వ్యత్యాసం తక్కువగా ఉండటం వల్ల విజయం ఎవరిని వరిస్తుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఓట్ల లెక్కింపులో ఇప్పటివరకు ఉన్న ముఖ్యాంశాలు ఇవే..

  1. మూడు దశల బిహార్​ ఎన్నికల్లో మొత్తం 4.16 కోట్ల ఓట్లు పోలయ్యాయి. ఓటింగ్ శాతం 57.09గా ఉంది.
  2. సాయంత్రం 5.30 గంటల వరకు 2.7 కోట్ల ఓట్లను లెక్కించారు.
  3. ఆయా నియోజకవర్గాలను బట్టి 19- 51 రౌండ్లలో కౌంటింగ్​ చేస్తున్నారు. సగటు కౌంటింగ్​ రౌండ్​ సంఖ్య 35గా ఉన్నట్లు ఈసీ తెలిపింది.
  4. ఒక్కో రౌండ్​ లెక్కింపునకు దాదాపు 30 నిమిషాల సమయం పడుతుంది.
  5. చాలా స్థానాల్లో ఇరువురి మధ్య ఆధిక్యం 1000 కన్నా తక్కువగా ఉంది.
  6. మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్​ రాఘోపుర్​ స్థానంలో లీడ్​లో కొనసాగుతున్నారు.
  7. లాలూ ప్రసాద్​ పెద్ద కుమారుడు తేజ్​ ప్రతాప్​ హస్నాపుర్​ స్థానంలో గెలుపొందారు.
  8. ఎన్​డీఏ అభ్యర్థి సీనియర్​ నేత జీతన్​ రామ్..​ ఇమామ్​గంజ్​లో ఆధిక్యంలో ఉన్నారు.
  9. ఎన్​డీఏ మిత్రపక్షం అభ్యర్థి ముకేశ్​ సాహ్ని సిమ్రి భక్తియార్​పుర్​లో లీడ్​లో కొనసాగుతున్నారు.
  10. రాష్ట్ర మంత్రులు నంద్​ కిశోర్​ యాదవ్​, బ్రిజేంద్ర ప్రసాద్ యాదవ్​, బినోద్​ నారాయణ్​ ఝా, శైలేశ్​ కుమార్​ వెనుకంజలో ఉన్నారు.
  11. జన్​ అధికార్​ పార్టీ నేత పప్పు యాదవ్​ వెనుకంజలో కొనసాగుతున్నారు.
  12. శత్రుఘ్న సిన్హా కుమారుడు కాంగ్రెస్​ నేత లవ్​ సిన్హా కూడా ఎదురీదుతున్నారు.
  13. ప్రస్తుతం ట్రెండింగ్​ ఇలాగే కొనసాగితే భాజపా రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉంది.
  14. మహాకూటమితో పొత్తు పెట్టుకొన్న వామపక్షాలు ఊహించని విధంగా 19 స్థానాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తున్నాయి.
  15. ఎన్​డీఏ నుంచి బయటకు వచ్చిన లోక్​జనశక్తి పార్టీ కేవలం ఒక్క స్థానంలో లీడ్​లో ఉంది.
  16. హైదరాబాద్​ ఎంపీ అసదుద్దీన్​ ఓవైసీ పార్టీ ఎఐఎమ్​ఐఎమ్ ఐదు స్థానాల్లో విజయం సాధించింది.
  17. ఇరు కూటముల మధ్య పోరు హోరాహోరీగా సాగుతోన్న తరుణంలో కేంద్ర హోంమంత్రి అమిత్​ షా.. సీఎం నితీశ్​కు ఫోన్​ చేశారు.
Last Updated : Nov 10, 2020, 7:29 PM IST

ABOUT THE AUTHOR

...view details