తెలంగాణ

telangana

ETV Bharat / bharat

NCRB Report 2021: కరోనా వేళ.. వ్యాపారుల ఆత్మహత్యలే ఎక్కువ!

కరోనా కష్టకాలంలో ఎక్కువగా వీధి వ్యాపారులు, రైతుల ఆత్మహత్యలు చేసుకున్నట్లు జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్​సీఆర్​బీ) (NCRB Report 2021) పేర్కొంది. వీరు మానసికంగా కుంగిపోయి బలవన్మరణాలకు పాల్పడినట్లు వెల్లడించింది.

NCRB Report 2021
వ్యాపారుల ఆత్మహత్యలు

By

Published : Nov 8, 2021, 11:30 PM IST

కరోనా మహమ్మారి దెబ్బకు దేశంలో దాదాపు అన్ని రంగాలు కుదేలయ్యాయి. ముఖ్యంగా వ్యాపార కార్యకలాపాలు లేక ఎన్నో కంపెనీలు మూతబడ్డాయి. అటు నష్టాలు, ఇటు మానసిక ఒత్తిడితో చాలా మంది కుంగిపోయారు. ఈ క్రమంలోనే గతేడాది ఆత్మహత్యలు కూడా పెరిగిపోయాయి. ముఖ్యంగా వ్యాపారుల బలవన్మరణాలు అంతక్రితంతో పోలిస్తే 30శాతం పెరగడం గమనార్హం. ఈ మేరకు జాతీయ నేర గణాంకాల సంస్థ నివేదిక వెల్లడించింది.

ఎన్‌సీఆర్‌బీ గణాంకాల (NCRB Report 2021) ప్రకారం.. 2020లో దేశవ్యాప్తంగా 11,716 మంది వ్యాపారులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరిలో 4,356 మంది ట్రేడ్స్‌మెన్‌ కాగా.. 4,226 మంది విక్రేతలు, మిగతా వారు ఇతర వ్యాపార కార్యకలాపాలకు చెందిన వారున్నారు. 2019తో పోలిస్తే వ్యాపార రంగంలో బలవన్మరణాలు గతేడాది 29శాతానికి పైగా పెరిగినట్లు నివేదిక తెలిపింది. అంతేగాక, 2020 లో రైతుల ఆత్మహత్యల (Farmer Suicides In India 2020) కంటే వ్యాపారుల బలవన్మరణాలే ఎక్కువ అని నివేదిక వెల్లడించింది. గతేడాది 10,677 మంది రైతులు ప్రాణాలు తీసుకున్నట్లు ఎన్‌సీఆర్‌బీ పేర్కొంది.

సాధారణంగా ఏటా రైతుల ఆత్మహత్యల కంటే వ్యాపార రంగంలో బలవన్మరణాలు తక్కువగానే ఉండేవి. అయితే గతేడాది కరోనా కారణంగా విధించిన ఆంక్షల నేపథ్యంలో చిన్న వ్యాపారాలు భారీగా దెబ్బతిన్నాయి. ఆదాయం లేక అప్పులు పెరిగి అనేక వ్యాపారాలు మూతబడ్డాయి. దీంతో ఆర్థికపరమైన ఒత్తిళ్లతో వ్యాపారులు ప్రాణాలు తీసుకున్నట్లు నివేదిక తెలిపింది.

కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో దేశంలో ఆత్మహత్యలు మరింత పెరిగాయి. దేశంలో వివిధ కారణాల వల్ల ప్రాణాలు తీసుకుంటున్న వారిసంఖ్య గతేడాదితో పోలిస్తే దాదాపు 10 శాతం ఎక్కువగా నమోదైందని ఎన్‌సీఆర్‌బీ వెల్లడించింది. 2020లో మొత్తం లక్షా 53 మంది పలు కారణాలతో ప్రాణాలు తీసుకున్నట్లు తెలిపింది.

ఇదీ చూడండి:గిరిజన బాలిక​పై అత్యాచారం.. ఇంట్లో నుంచి అపహరించి..

ABOUT THE AUTHOR

...view details