మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో లుకలుకలు బయటపడిన వేళ ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మధ్య రహస్య భేటీ చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి ఎటువంటి వివరాలూ బయటకు రాలేదు. అయితే, ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన అమిత్ షాను మీడియా ప్రతినిధులు ఈ అంశంపై ప్రశ్నించారు. దీనికి ఆయన తనదైన శైలిలో 'ప్రతిదీ బయటకు చెప్పలేం' కదా అని బదులిచ్చారు. భేటీ జరిగిందని గానీ, జరగలేదని గానీ ధ్రువీకరించకపోవడం మరిన్ని ఊహాగానాలకు తావిచ్చింది.
అనిల్ అనుకోకుండా..
సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఎన్సీపీకి చెందిన హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పవార్, ఆ పార్టీకి చెందిన మరో సీనియర్ నేత అహ్మదాబాద్‌లో శనివారం అమిత్‌షాతో భేటీ అయినట్లు వార్తలు వచ్చాయి. హోంమంత్రి రాజీనామాకు ఓ వైపు మహారాష్ట్రలోని ప్రతిపక్ష భాజపా పట్టుబడుతున్న వేళ ఈ భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశంలో రెండు పార్టీలకు చెందిన నేతలే పాల్గొన్నారా? వేరే ఇంకెవరైనా పాల్గొన్నారా? ఇంతకీ ఏం చర్చించారు? అనే దానిపై సమాచారం లేదు. మరోవైపు అనిల్ దేశ్‌ముఖ్‌పై శివసేన నేత సంజయ్ రౌత్ 'సామ్నా' పత్రికలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన అనుకోకుండా హోంమంత్రి అయ్యారన్నారు.
ముంబయి పోలీస్ కమిషనర్ కార్యాలయంలో వాజే కూర్చుని వసూళ్లకు తెరలేపిన విషయం హోంమంత్రికి తెలీకపోవడం ఏంటని ప్రశ్నించారు. రౌత్ వ్యాఖ్యలు, పవార్ రహస్య భేటీ పరిణామాలు చూస్తుంటే మహారాష్ట్రలో మరోసారి రాజకీయాలు రక్తికట్టించేలా కనిపిస్తున్నాయి.
అవన్నీ పుకార్లే..