బంగాల్లో ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం జరిగిన హింసాత్మక సంఘటనల్లో పాల్గొనడానికి చాలా మంది పిల్లలను నియమించినట్లు ఫిర్యాదులు అందాయని బాలల హక్కుల రక్షణ కమిషన్ (ఎన్‌సీపీసీఆర్)పేర్కొంది. వీటిపై ఆందోళన వ్యక్తం చేస్తూ బంగాల్ ప్రధాన కార్యదర్శికి ఎన్‌సీపీసీఆర్ లేఖ రాసింది. హింసపై సమగ్ర నివేదికను కోరింది.
బంగాల్ లో ఈనెల 3న పెద్ద ఎత్తున్న హింస చెలరేగింది. భాజపా కార్యకర్తలు ఘర్షణల్లో చనిపోయారు. చాలా మంది గాయపడ్డారు. దీనికి సంబంధించి పలు మీడియా నివేదికలు వచ్చాయని కమిషన్ తెలిపింది.
"మే 2 న బంగాల్ లో ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అనేక హింస సంఘటనలు నమోదవుతున్నాయి. ఇవి ప్రజలను భయపెడుతున్నాయి. అలాగే వారి ప్రాణాలకు ముప్పుగా మారాయి. ముఖ్యంగా హింసాత్మక ఘటనలు పిల్లలకు మరింత హాని కలిగించే అవకాశాలు ఉన్నాయి."