తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పుట్టినరోజునే శరద్ పవార్​కు బెదిరింపు ఫోన్​ కాల్స్.. నిందితుడు అరెస్ట్ - శరద్​ పవార్​ నివాసానికి బెదిరింపు కాల్స్​

ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్​కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆయన ఇంటికి ఓ గుర్తు తెలియని వ్యక్తి పదే పదే కాల్స్​ చేయడం తీవ్ర కలకలం రేపింది.

ncp president sharad pawar
ncp president sharad pawar

By

Published : Dec 13, 2022, 2:28 PM IST

ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్​ ఇంటికి గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు కాల్స్​ వచ్చాయి. ఆయన్ను హత్య చేస్తామంటూ దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారు. సోమవారం శరద్ పవార్ పుట్టినరోజు కాగా.. అదేరోజు ఈ బెదిరింపు కాల్​ రావడం కలకలం రేపింది. ఇదివరకే ఇలా పలుమార్లు కాల్స్​ వచ్చిన నేపథ్యంలో.. భయభ్రాంతులకు గురైన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.

అసలేం జరిగింది: ఎన్సీపీ నేత శరద్ పవార్ సిల్వర్ ఓక్ నివాసానికి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి ఆయన్ను చంపేస్తానని బెదిరించాడు. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో కాల్​డేటా ఆధారంగా బిహార్​కు చెందిన నారాయణ్ సోనీ అనే వ్యక్తి పేరు తెరపైకి వచ్చింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అయితే ఈ వ్యక్తి ఇదివరకే పలు మార్లు పవార్​ ఇంటికి కాల్​ చేశాడని అప్పట్లో అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు మందలించి వదిలేశారని తెలిపారు. ఈ క్రమంలో సోమవారం వచ్చిన కాల్​తో అతనే దీనికి కారణమని కన్ఫార్మ్​ చేసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details