మహారాష్ట్ర నాగపుర్లో జరుగుతున్న శాసనసభ శీతాకాల సమావేశాలకు నాసిక్ జిల్లాకు చెందిన ఎన్సీపీ ఎమ్మెల్యే సరోజ్ అహిర్ తన పసిబిడ్డతో హాజరయ్యారు. "నేను ఇప్పుడు ఒక తల్లిని, ప్రజాప్రతినిధిని. గత రెండున్నరేళ్లుగా కరోనా మహమ్మారి కారణంగా నాగపుర్లో అసెంబ్లీ సమావేశాలు జరగలేదు. ఇప్పుడు నేను ఒక పసిబిడ్డకు తల్లినే అయినా.. నేను నా ప్రశ్నలను లేవనెత్తి వాటికి ప్రభుత్వం నుంచి సమాధానాలను పొందేందుకే నా బిడ్డను ఎత్తుకుని ఇక్కడికి వచ్చాను".
రెండున్నర నెలల పసిబిడ్డతో.. అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యే
మహారాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలకు ఎన్సీపీ ఎమ్మెల్యే సరోజ్ అహిర్ రెండున్నర నెలల వయసున్న పసిబిడ్డను ఎత్తుకుని హాజరయ్యారు. ఆమె తన బిడ్డతో అసెంబ్లీకి హాజరయ్యేందుకు ఓ ముఖ్యమైన కారణం ఉందని చెప్పారు.
పసిబిడ్డతో శీతాకాల సమావేశానికి హాజరైన ఎన్సీపీ ఎమ్మెల్యే సరోజ్ అహిర్
ఎన్సీపీ ఎమ్మెల్యే సరోజ్ అహిర్ కుమారుడికి ఇప్పుడు రెండున్నర నెలల వయసు. సరోజ్ సెప్టెంబరు 30న ఈ బిడ్డకు జన్మనిచ్చారు.
Last Updated : Dec 19, 2022, 8:27 PM IST