ఇటీవల అస్వస్థతకు గురైన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మంగళవారం.. ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేరారు. పొత్తికడుపులో నొప్పి రావడం వల్ల ఆస్పత్రిలో చేర్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. గాల్‌బ్లాడర్ సమస్యతో బాధపడుతున్న పవార్‌కు బుధవారం శస్త్రచికిత్స జరగాల్సి ఉంది. అయితే మంగళవారం అస్వస్థతకు గురవడం వల్ల ఒకరోజు ముందే ఆస్పత్రిలో చేరారు.
శస్త్రచికిత్సకు ఒకరోజు ముందే ఆస్పత్రికి శరద్ పవార్ - sharad pawar health
అస్వస్థత కారణంగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆస్పత్రిలో చేరారు. గాల్‌బ్లాడర్ సమస్యతో బాధపడుతున్న పవార్‌కు బుధవారం ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరగాల్సి ఉంది.
శరద్ పవార్
పవార్‌కు బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు శస్త్రచికిత్స నిర్వహిస్తారని ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే వెల్లడించారు. సర్జరీ తర్వాత ఆరోగ్య స్థితి గమనించి డిశ్చార్జిపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి :శరద్ పవార్‌కు స్వల్ప అస్వస్థత- ఆస్పత్రిలో చేరిక
Last Updated : Mar 30, 2021, 9:43 PM IST