అక్రమాస్తుల కేసులో ఆదాయ పన్ను శాఖ అధికారులు.. ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా వాంగ్మూలం తీసుకున్నారు.
అక్రమాస్తుల కేసులో వాద్రా వాంగ్మూలం నమోదు - వాద్రా తాజా వార్తలు

14:32 January 04
అక్రమాస్తుల కేసులో వాద్రా వాంగ్మూలం నమోదు
''ఆదాయ పన్ను శాఖ బృందం.. వాద్రా ఇంటికి చేరుకొని బినామీ కేసులో ఆయన వాంగ్మూలం నమోదు చేసింది.''
- ఐటీ వర్గాలు
లండన్‌లో బ్రియాన్స్టన్ స్క్వేర్‌లో 1.9 మిలియన్ పౌండ్లు విలువ చేసే భవనాన్ని వాద్రా అక్రమంగా కొనుగోలు చేశారని ఆరోపణలున్నాయి. దీనిపై ఇప్పటికే మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన ఎన్ఫోర్స్మెంట్ కూడా విచారణ జరుపుతోంది. ప్రస్తుతం.. కొవిడ్ నేపథ్యంలో ఆయన విచారణకు దూరంగా ఉన్నారు. ఆయనకు ముందస్తు బెయిల్ కూడా మంజూరైంది.
ఇదీ చూడండి:మూడేళ్ల పాప లాకప్ డెత్‌పై నిరసన జ్వాల