ముంబయి క్రూజ్ షిప్ డ్రగ్స్ కేసులో సాక్షిగా ఉన్న కిరణ్ గోసావిని (Kiran Gosavi Latest News) పుణె పోలీసులు అరెస్ట్ చేశారు. 2018 చీటింగ్ కేసుకు సంబంధించి అతడిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
2018 నుంచి పరారీలోనే ఉన్న గోసావిని.. 2019లో వాంటెడ్‌గా (Kiran Gosavi Latest News) ప్రకటించినట్లు పోలీసులు తెలిపారు. క్రూజ్ షిప్‌పై ఎన్సీబీ ఇటీవల రైడ్ చేపట్టిన తర్వాతే అతని ఆచూకీ తెలిసిందన్నారు.
'ఎలాంటి రాజకీయాలు లేవు'
చీటింగ్ కేసులో నిందితుడిగా ఉన్న కిరణ్ గోసావి.. సచిన్ పాటిల్ అనే పేరును కూడా ఉపయోగిస్తున్నారని పుణె పోలీస్ కమిషనర్ అమితాబ్ గుప్తా పేర్కొన్నారు. ఈ అరెస్టు వెనుక ఎలాంటి రాజకీయాలు లేవని స్పష్టం చేశారు. నిందితుడిని ముంబయి పోలీసులు లేదా ఇతర దర్యాప్తు సంస్థలకు అప్పగించడంపై స్పందించిన గుప్తా.. ఇప్పటివరకు ఎవరూ తమను సంప్రదించలేదని తెలిపారు. గోసావి మీద మరిన్ని ఫిర్యాదులు అందితే మరో కేసు దాఖలు చేస్తామని స్పష్టం చేశారు.
అంతకుముందు.. ఇదే కేసులో గోసావి సహాయకుడైన షేర్బానో ఖురేషీని (Kiran Gosavi Latest News) పోలీసులు అరెస్ట్ చేశారు. మలేసియాలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ గోసావి తన వద్ద నుంచి రూ.3.09 లక్షలు డిమాండ్ చేశారని, ఖురేషీకి తాను డబ్బులు ఇచ్చానని చిన్మయ్ దేశ్‌ముఖ్ అనే వ్యక్తి ఆరోపించారు. ఈ మేరకు 2018లో తన ఫిర్యాదులో పేర్కొన్నారు.