తెలంగాణ

telangana

ETV Bharat / bharat

డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్​కు క్లీన్​చిట్​

Aryan Khan: షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్​కు డ్రగ్స్ కేసులో క్లీన్​ చిట్ ఇచ్చింది ఎన్​సీబీ. ఆర్యన్​కు డ్రగ్స్​తో సంబంధం ఉందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని కోర్టుకు సమర్పించిన అభియోగ పత్రంలో పేర్కొంది.

Aryan Khan
ఆర్యన్ ఖాన్​

By

Published : May 27, 2022, 1:33 PM IST

Updated : May 27, 2022, 2:06 PM IST

Aryan Khan News: ముంబయి క్రూజ్​షిప్​ డ్రగ్స్​ కేసులో నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో ఛార్జ్​షీట్ సమర్పించింది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్​ ఖాన్​ను క్లీన్​చిట్ ఇచ్చింది. అతనితో పాటు మరి కొందరికి కూడా క్లీన్​చిట్​ ఇచ్చింది. వీరికి డ్రగ్స్​తో సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు రిజిస్ట్రీకి సమర్పించిన ఛార్జ్​షీట్​లో ఎన్​సీబీ పేర్కొంది. ఈ డ్రగ్స్​ కేసును మొదట ఎన్సీబీ ముంబయి జోన్​ అధికారులు విచారించారు. ఆ తర్వాత ఎన్సీబీ దిల్లీ కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం కేసును తమ చేతుల్లోకి తీసుకుంది.

2021 అక్టోబర్ 2న ముంబయి నగర శివారులోని తీరప్రాంతంలో క్రూజ్‌ నౌకలో రేవ్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీకి షారుక్ తనయుడు ఆర్యన్‌తోపాటు మరికొందరు హాజరయ్యారు. అక్కడ మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నారనే సమాచారం అందుకున్న నార్కటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారులు సోదాలు చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం ఆర్యన్‌తో సహా పలువురిని అరెస్ట్‌ చేశారు. ఈ దాడులకు అప్పటి ఎన్సీబీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడే నేతృత్వం వహించారు. ఆ తర్వాత ఈ ఘటన రాజకీయ దుమారానికి దారి తీసింది. తొలుత ఆర్యన్ ఖాన్​కు జ్యుడీషియల్ కస్టడీ విధించిన న్యాయస్థానం, ఆ తర్వాత కొద్ది రోజులకు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం 19 మందిలో 17మందికి ఇప్పటికే బెయిల్ లభించింది.

ఇదీ చదవండి:'టెక్నాలజీకి గత పాలకులు దూరం- పేదలకు నష్టం'

Last Updated : May 27, 2022, 2:06 PM IST

ABOUT THE AUTHOR

...view details