ఛత్తీస్‌గఢ్‌లోని కిరండోల్-విశాఖ రైల్వే మార్గంపై మావోయిస్టులు దాడి చేశారు. జిర్కా అటవీ ప్రాంతంలోని కమలూర్-భాన్సీ (Naxalite Attack in Chhattisgarh Today) మధ్య ఉన్న రైల్వే ట్రాక్‌ను ధ్వంసం చేశారు. దీంత ఆ మార్గంలో వస్తున్న ఓ గూడ్స్ రైలు ప్రమాదానికి గురైంది. ఐదు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి (Naxalite Attack in Chhattisgarh Today) సుమారు 12.30కు జరిగినట్లు తెలుస్తోంది.
అదే కారణం..
ఇటీవల పోలీసులు కాల్పుల్లో మృతిచెందిన నక్సల్స్‌కు నివాళిగా (Naxalite Attack in Chhattisgarh Today) శనివారం బంద్‌ను ప్రకటించారు మావోలు. ఈ క్రమంలో పోలీసుల చర్యలకు ప్రతీకారంగా ట్రాక్‌ను ధ్వంసం చేసి.. రైలు ఇంజిన్‌కు భారత్ బంద్‌కు పిలుపునిస్తూ బ్యానర్‌ను కట్టారు.