తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'బీజాపుర్ అడవుల్లో డ్రోన్​ బాంబులు.. పోలీసుల పనే'

ఏప్రిల్ 19న ఛత్తీస్‌గఢ్ బీజాపుర్ అడవుల్ల పోలీసులు- కేంద్ర బలగాలు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి.. బాంబులు జార విడిచారని దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీ పేరిట లేఖ విడుదలైంది. బలగాల్లో స్థైర్యం నింపేందుకు ఈ పని చేశారని నక్సల్స్ ప్రకటన పేర్కొంది. అయితే ఈ ఆరోపణలను పోలీసు అధికారులు తోసిపుచ్చారు.

naxalites
నక్సల్స్ దాడి

By

Published : Apr 21, 2021, 9:32 PM IST

ఛత్తీస్‌గఢ్ బీజాపుర్​ జిల్లా దండకారణ్యంలోని రెండు గ్రామాలకు సమీపంలో బలగాలు డ్రోన్ల ద్వారా బాంబులు వేశాయంటూ నక్సల్స్ చేస్తున్న ఆరోపణలను పోలీసు అధికారులు తోసిపుచ్చారు. ఏప్రిల్ 19న దండకారణ్యంలో డ్రోన్‌ల ద్వారా రెండు ఊర్ల సమీపంలో పోలీసులు- కేంద్ర బలగాలు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి.. బాంబులు జార విడిచారని దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీ పేరిట లేఖ విడుదలైంది. ఇటీవల నక్సల్స్ దాడిలో 22 మంది మృతిచెందగా.. బలగాల్లో స్థైర్యం నింపేందుకు ఈ పని చేశారని నక్సల్స్ ప్రకటన పేర్కొంది. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను కూడా విడుదల చేశారు.

నిరాధార ఆరోపణలు

దీనిపై స్పందించిన అధికారులు.. అవన్నీ నిరాధార ఆరోపణలుగా కొట్టిపారేశారు. నక్సల్స్ నాయకత్వంలో భయం నెలకొన్న విషయం ఈ ప్రకటన ద్వారా వెల్లడవుతోందని చెప్పారు. స్థానికుల ఆస్తులకు, ప్రాణాలకు ఏ విధమైన నష్టం కలిగించకూడదన్న ఒకే ఒక్క అజెండాతో బస్తర్ అడవుల్లో బలగాలు పనిచేస్తున్నాయని చెప్పారు. ఐఈడీలు వాడి అమాయకుల ప్రాణాలు తీసే అలవాటు నక్సలైట్లకే ఉందని పోలీసులు వ్యాఖ్యానించారు.

పోలీస్ కిడ్నాప్

ఛత్తీస్​గఢ్ బీజాపుర్ జిల్లాలో ఓ పోలీస్ అధికారుడిని నక్సల్స్ కిడ్నాప్ చేసినట్లు బీజాపుర్​ ఎస్పీ కల్మోచన్ కశ్యప్ తెలిపారు. మురళి.. తన గ్రామం పల్నార్​కు వచ్చిన సమయంలో కిడ్నాప్ చేసినట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి :'ఆ జిల్లాల్లో 15% పైగా పాజిటివిటి రేటు'

ABOUT THE AUTHOR

...view details