ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లా అంబేడా ప్రాంతంలో భద్రతా దళాలే లక్ష్యంగా బాంబులు అమరుస్తున్న నక్సలైట్లకు ఎదురుదెబ్బ తగిలింది. భూమిలో అమర్చుతుండగా అదే బాంబు పేలి ఒక నక్సలైట్ మరణించాడు.
ఈ నెల 18న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉదయం 6గంటల ప్రాంతంలో సహదేవ్ వేద్దా.. అంబేడాకు సమీపంలో ఐఈడీ బాంబు అమర్చుతున్నాడు. ఈ క్రమంలో అది పేలి వేద్దా అక్కడికక్కడే మరణించాడు. సమీపంలోని నక్సలైట్లు గాయపడ్డారు.
అమరవీరునిగా..
ఘటన జరిగిన వారం రోజులకు సోమ్జీ అలియాస్ సహదేవ్ వేద్దా మరణాన్ని మావోయిస్టు పార్టీ ధ్రువీకరించింది. ఈ మేరకు ఉత్తర బస్తర్ డివిజనల్ కమిటీ ప్రతినిధి సుఖ్‌దేవ్ పత్రికా ప్రకటనను విడుదల చేశాడు. చనిపోయిన నక్సలైట్‌ను అమరవీరుడుగా పేర్కొన్నారు. ఉత్తర బస్తర్ డివిజన్లోని అనేక గ్రామాల్లో కరపత్రాలు పంపిణీ చేసి.. నక్సలైట్లకు సంబంధించిన బ్యానర్లు, పోస్టర్లను ప్రదర్శించారు.
చనిపోయిన నక్సలైట్‌ను కీర్తిస్తూ విడుదల చేసిన కరపత్రం ఇదీ చదవండి:ముష్కరుల గుట్టురట్టు- భారీగా ఆయుధాలు స్వాధీనం