దేశంలో ఆక్సిజన్ అవసరాలను తీర్చేందుకు భారత నౌకాదళం రంగంలోకి దిగింది. ఆపరేషన్ సముద్ర సేతు-2 పేరుతో భారత్‌కు ఆక్సిజన్ నిండిన కంటైనర్లను రవాణా చేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ఆపరేషన్ కింద.. ద్రవ ఆక్సిజన్ నిండిన క్రయోజెనిక్ కంటైనర్లు, అనుబంధ వైద్య పరికరాలను యుద్ద నౌకల ద్వారా నౌకాదళం రవాణా చేయనుంది.
ఐఎన్ఎస్ కోల్‌కతా, ఐఎన్‌ఎస్ తల్వార్ అనే రెండు యుద్ధ నౌకలు.. బహ్రెయిన్‌లోని మనామా నౌకాశ్రయం నుంచి ఆక్సిజన్‌ను తరలిస్తుండగా... బ్యాంకాక్ నుంచి ఐఎన్ఎస్ జలష్వా, సింగపూర్ నుంచి ఐఎన్ఎస్ ఐరావత్ ఆక్సిజన్‌ను తరలిస్తున్నట్లు భారత నౌకాదళం వెల్లడించింది.