భారత నౌకాదళం.. మొదటిసారిగా శునకాలతో విన్యాసం చేసింది. ఎక్స్‌ప్లోజివ్-స్నిఫ్ఫింగ్ శునకాలతో ఈ విన్యాసం చేసినట్లు భారత నావికాదళం ట్విటర్ వేదికగా వెల్లడించింది.
శునకాలతో నేవీ ప్రత్యేక విన్యాసం - భారత నౌకాదళం ట్వీట్
శిక్షణ పొందిన ప్రత్యేక శునకాలతో వెస్టర్న్ నేవల్ కమాండ్ అధికారులు విన్యాసం చేసినట్లు పేర్కొంది భారత నౌకాదళం. దీనికి సంబంధించిన వీడియో ట్విటర్లో పోస్ట్ చేసింది.
![శునకాలతో నేవీ ప్రత్యేక విన్యాసం Navy divers slither down from chopper with sniffer dogs](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10618455-thumbnail-3x2-navy.jpg)
ప్రత్యేక శునకాలతో నేవీ విన్యాసం
బాంబు బెదిరింపుల నేపథ్యంలో... వెస్టర్న్ నేవల్ కమాండ్‌కు చెందిన డైవర్లు మింకి, ముక్తి అనే రెండు ఎక్స్‌ప్లోజివ్ స్నిఫ్ఫింగ్ శునకాలతో హెలికాప్టర్ డైవ్ చేపట్టారని భారత నేవీ ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇలాంటి విన్యాసాలు మనుషులు తరచూ చేసినా.. శునకాలతో చేయడం ఇదే మొదటిసారి అని వెల్లడించింది.
ఇదీ చదవండి:'ఆ సరస్సుతో ఇక ప్రమాదం లేదు'