తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మిస్టర్ సీఎం.. ధైర్యముంటే నాపై పోటీ చేయండి: నవనీత్ సవాల్

Navneet Kaur Rana MP Amravati: హనుమాన్ చాలీసా వివాదంలో అరెస్టై, విడుదలైన అమరావతి ఎంపీ నవనీత్​ కౌర్​ మహారాష్ట్ర ముఖ్యమంత్రిపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎక్కడ నుంచైనా సరే తనపై ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్​ విసిరారు.

hanuman chalisa row
hanuman chalisa row

By

Published : May 8, 2022, 3:40 PM IST

Navneet Kaur Rana MP Amravati: "హనుమాన్​ చాలీసా చదవడమే నేరమా? శ్రీరామ నామాన్ని తలచినందుకు 14 రోజులు జైల్లో పెట్టారు. అదే నేరమైతే 14 రోజులు కాదు 14 ఏళ్లు జైల్లో ఉంటాను" అంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​​ ఠాక్రేపై తీవ్ర విమర్శలు చేశారు అమరావతి ఎంపీ నవనీత్​ కౌర్​. బెయిల్​పై విడుదలైన ఆమె ముంబయిలోని లీలావతి అస్పత్రిలో చికిత్స పొందారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు.

మహారాష్ట్రలో ఎక్కడి నుంచైనా సరే తనపై ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రేకు సవాల్​ విసిరారు నవనీత్ కౌర్. ఆయనకు మహిళల సత్తా ఎంటో చూపిస్తానన్నారు. శివసేన ఎంపీ సంజయ్​ రౌత్​ను చిలుకగా అభివర్ణించిన ఆమె.. ఆయనపై ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు.

అస్రత్రి నుంచి డిశ్చార్జైన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న నవనీత్​ కౌర్​

"రాష్ట్ర ప్రభుత్వం మహిళను అణచివేయలేదు. నేను ఇంకా బాధపడుతున్నాను. వైద్యులను అభ్యర్థించి.. డిశ్చార్జ్​ అయ్యాను. నాపై చాలా క్రూరమైన కుట్రలు పన్నారు. ముంబయిలో శాంతిభద్రతలు లేవు. ముంబయి కార్పొరేషన్​ అవినీతిలో కూరుకుపోయింది. నేను ముంబయికి చెందిన అమ్మాయిని. వారి అవినీతిపై పోరాటం చేస్తాను"

- నవనీత్ కౌర్​, అమరావతి ఎంపీ

ఇదీ జరిగింది: మహారాష్ట్ర సీఎం ఇంటి వద్ద తన భర్తతో కలిసి హనుమాన్ చాలీసా చదువుతానని ఎంపీ నవనీత్​ రాణా గత నెలలో సవాల్ చేయడం ఉద్రిక్తతలకు దారి తీసింది. ఉద్ధవ్ ఠాక్రే హిందుత్వాన్ని మరిచిపోయారని, అది గుర్తు చేసేందుకు హనుమాన్​ చాలీసా చదువుతానని ఆమె అనడం శివసేన కార్యకర్తలను ఆగ్రహానికి గురిచేసింది. దీంతో వారు ఏప్రిల్ 23న నవనీత్​ రాణా ఇంటి వద్దకే వెళ్లారు. హనుమాన్ చాలీసా చదివేందుకు రావాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. ఆ తర్వాత నవనీత్​ కౌర్​, ఆమె భర్త రవి రాణాను పోలీసులు అరెస్టు చేశారు. న్యాయస్థానం వారికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అనంతరం షరతులతో కూడిన బెయిల్​ను మంజూరు చేసింది కోర్టు.

ఇదీ చదవండి:నర్సుగా రోగులకు సేవలు.. జిమ్​లో వర్కౌట్స్​తో కండలు.. టార్గెట్ ఒలింపిక్స్!

ABOUT THE AUTHOR

...view details