పంజాబ్ సీఎం పదవికి రాజీనామా (Punjab CM resign) చేసిన అమరీందర్ సింగ్ (Amarinder Singh news).. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్‌సింగ్ సిద్ధూపై (Navjot Singh Sidhu) తీవ్ర ఆరోపణలు చేశారు. తదుపరి సీఎంగా సిద్ధూను ప్రతిపాదిస్తే తాను తిరస్కరిస్తానని అన్నారు. సిద్ధూ అసమర్థుడని, ఆయనకు పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. (Amarinder Singh and Navjot Singh Sidhu) సిద్ధూ ముఖ్యమంత్రి అయితే దేశ భద్రతకే ప్రమాదమని హెచ్చరించారు.
"ఆయన(సిద్ధూ)కు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బజ్వా, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌లతో స్నేహం ఉంది. పంజాబ్ ముఖ్యమంత్రిగా (Punjab next CM) ఆయన పేరు ప్రతిపాదిస్తే.. దేశ ప్రయోజనాల కోసం వ్యతిరేకిస్తా. ఆయనో అసంపూర్ణమైన వ్యక్తి. సిద్ధూ దేశానికి విపత్తుగా మారే ప్రమాదం ఉంది."
-అమరీందర్ సింగ్, పంజాబ్ మాజీ సీఎం
శనివారం ఉదయం సోనియా గాంధీతో (Sonia Gandhi news) మాట్లాడినట్లు అమరీందర్ తెలిపారు. రాజీనామా విషయంపై చర్చించినట్లు చెప్పారు. దానికి 'అయామ్ సారీ' అని సోనియా బదులిచ్చారని వివరించారు. భాజపాలో చేరే అవకాశాలపై ప్రశ్నించగా.. ఎవరితోనూ చర్చించలేదని అమరీందర్ బదులిచ్చారు.
గవర్నర్ ఆమోదం