Navjot Sidhu Jail : 34 ఏళ్ల క్రితం జరిగిన ఓ వివాదంలో జైలు శిక్ష అనుభవిస్తున్న పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ త్వరలో జైలు నుంచి విడుదల కానున్నారు. జనవరి 26న ఆయనకు విముక్తి లభించనుందని కాంగ్రెస్ పార్టీ నేత నరేంద్ర పాల్ లల్లి తెలిపారు. ఆ రోజు సిద్ధూకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. విడుదలైన తర్వాత సిద్ధూ దుర్గియానా ఆలయం, హర్మందిర్ సాహిబ్ ధార్మిక ప్రదేశాల్లో పూజలు చేస్తారని వెల్లడించారు.
జైలు నుంచి సిద్ధూ ముందస్తు విడుదల.. మోదీ సర్కార్ రూల్‌తో... - navjot singh sidhu release on republic day
34 ఏళ్ల క్రితం జరిగిన ఓ ఘర్షణ కేసులో జైలుకు వెళ్లిన పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ జనవరి 26న విడుదల కానున్నారు. జైలు నుంచి విడుదలయ్యాక ఆయనకు ఘన స్వాగతం పలకనున్నట్లు కాంగ్రెస్ నేత ఒకరు తెలిపారు.
ఆ జాబితాలో సిద్ధూ పేరు!
కేంద్ర ప్రభుత్వ విధానం ప్రకారం ఏటా సత్ప్రవర్తన గల 50 మంది ఖైదీలను జైలు నుంచి విడుదల చేస్తారు. 2023 జనవరి 26న విడుదల చేయబోయే ఖైదీల జాబితా ఇప్పటికే సిద్ధమైంది. ఆ జాబితాలో సిద్ధూ పేరు ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మే నుంచి జైలులో సిద్ధూ క్లర్క్‌గా పనిచేస్తున్నారని.. ఎలాంటి సెలవులు తీసుకోలేదని తెలుస్తోంది. జైలులో ఆయన ప్రవర్తన బాగానే ఉందని, అందుకే ఆయనను కేంద్రం విడుదల చేయనుందని సమాచారం.
పార్కింగ్ విషయంలో గొడవ వల్ల..
1988లో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన కేసులో సిద్ధూను రూ.1000 జరిమానాతో విడిచిపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ బాధిత కుటుంబం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై విచారించిన సుప్రీంకోర్టు సిద్దూకు ఏడాది పాటు జైలు శిక్ష విధించాలని మే నెలలో తీర్పు వెలువరించింది. 1988 డిసెంబరు 27న పంజాబ్‌లోని పటియాలో పార్కింగ్ విషయంపై 65 ఏళ్ల గుర్నామ్ సింగ్‌కు సిద్ధూ, తన స్నేహితుడు రూపిందర్ సింగ్‌కు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో గుర్నామ్ సింగ్ ప్రాణాలు కోల్పోయాడు. దీనికి సంబంధించిన కేసులో ప్రస్తుతం సిద్దూ జైలు శిక్ష అనుభవిస్తున్నారు.