పంజాబ్ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామాపై ఆ పార్టీ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ (Navjot Singh Sidhu) వెనక్కి తగ్గారు. తాను చేసిన రాజీమాను వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే.. కొత్త అడ్వకేట్ జనరల్‌ను ప్రభుత్వం నియమించిన రోజే.. తాను అధ్యక్ష బాధ్యతలు చేపడతానని స్పష్టం చేశారు.
"నా రాజీనామాను వెనక్కు తీసుకున్నాను. కొత్త అడ్వకేట్ జనరల్‌ను నియమించి, కొత్త ప్యానల్ ఏర్పాటు అయిన రోజే.. నా ఆఫీస్‌లో బాధ్యతలు స్వీకరిస్తాను. ఇది అహంకారంతో చేస్తున్న పని ఏ మాత్రం కాదు."
- నవజ్యోత్ సింగ్ సిద్ధూ, పీపీసీసీ అధ్యక్షుడు
పంజాబ్ కొత్త సీఎం చరణ్‌జీత్ సింగ్ చన్నీ... తన ఆలోచనలకు విరుద్ధంగా స్వతంత్రంగా వ్యవహరించడం, స్వయంగా తాను ఎంపిక చేసిన వ్యక్తులకే కీలక బాధ్యతలు అప్పగించడం లాంటి పనులతో సిద్ధూ మనస్తాపానికి గురయ్యారు. అడ్వకేట్ జనరల్ నియామకంపైనా అసహనంగా ఉన్నారు. అన్మోల్ రతన్‌కు ఆ బాధ్యతలు అప్పగించాలని ఆయన సూచించారు. కానీ చన్నీ మాత్రం ఏపీఎస్ దేఓల్‌ను ఎంపిక చేశారు. దీంతో అసహనానికి గురైన సిద్ధూ సెప్టెంబర్ 28న పీసీసీ పదవికి రాజీనామా చేశారు.
ఇవీ చూడండి: