తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాహుల్​తో నవ్​జ్యోత్​ సింగ్ సిద్ధూ భేటీ

పంజాబ్​ మాజీ మంత్రి నవ్​జ్యోత్​ సింగ్​ సిద్ధూ.. కాంగ్రెస్​ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీతో బుధవారం సమావేశమయ్యారు. సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్​కు సిద్ధూకి మధ్య ఘర్షణ వాతావరణం తారాస్థాయికి చేరిన క్రమంలో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.

Sidhu meets Rahul Gandhi
రాహుల్​తో నవ్​జ్యోత్​ సింగ్ సిద్ధూ భేటీ

By

Published : Jun 30, 2021, 10:47 PM IST

పంజాబ్​ కాంగ్రెస్​ అసంతృప్తి నేత నవ్​జ్యోత్​ సింగ్​ సిద్ధూ.. పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీని బుధవారం సాయంత్రం కలిశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాను కలిసిన అనంతరం రాహుల్​తో సమావేశం అయ్యారు.

కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌కూ, మాజీ మంత్రి నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూకు మధ్య ఘర్షణ వాతావరణం తారస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్​ పార్టీ అంతర్గత సమస్యలను, కుమ్ములాటలను అధిష్ఠానం నివారించలేకపోతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్న క్రమంలో రాహుల్​తో నవజ్యోత్​సమావేశం కావడం కీలక పరిణామమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

పంజాబ్​ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో సీఎం కెప్టెన్​ అమరీందర్​​ సింగ్​పై కొంతకాలంగా బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు సిద్ధూ. ఈ సమస్యను పరిష్కరించేందుకు గతంలో ఓ ప్యానెల్​ను ఏర్పాటు చేయగా.. ఆ కమిటీ ముందు కూడా సిద్ధూ హాజరయ్యారు.

ఇవీ చదవండి:సీఎంతో భేటీకి నో- సిద్ధూతో మాత్రం సుదీర్ఘ చర్చలు!

కలహాల బాటలో నేతలు- నివారించలేకపోతున్న అధిష్ఠానం

ABOUT THE AUTHOR

...view details