Naveen Shekharappa: రష్యా యుద్ధంతో ఉక్రెయిన్‌లో చనిపోయిన భారతీయ విద్యార్థి నవీన్ శేఖరప్ప మృతదేహాన్ని దేవనగరేలోని ఎస్ఎస్ హైటెక్ ఆస్పత్రికి అప్పగించారు అతని కుటుంబ సభ్యులు. తండ్రి శేఖరప్ప గ్యానగౌదర్, తల్లి విజయలక్ష్మీ, సోదరుడు హర్షల ఆధ్వర్యంలో నవీన్ పార్థివదేహాన్ని ఆస్పత్రికి చెందిన ఆర్గన్ అనాటమీ డిపార్ట్మెంట్కు అందజేశారు. తాను ఇదివరకు చెప్పినట్లుగానే తన కుమారుడి పార్థివదేహాన్ని పరిశోధనలకు ఉపయోగపడేలా ఆస్పత్రికి అప్పగించానని శేఖరప్పు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు.
పరిశోధనల కోసం ఆస్పత్రికి ఆ విద్యార్థి మృతదేహం - నవీన్ శేఖరప్ప మృతదేహం
Naveen Shekharappa: ఉక్రెయిన్‌లో చనిపోయిన భారతీయ విద్యార్థి నవీన్ శేఖరప్ప మృతదేహాన్ని ఎస్ఎస్ హైటెక్ ఆస్పత్రికి అప్పగించారు కుటుంబ సభ్యులు. ఖర్కీవ్‌లో జరిగిన పేలుళ్లలో మార్చి 1న నవీన్ ప్రాణాలు కోల్పోయాడు. సోమవారం తెల్లవారుజామున నవీన్ మృతదేహం బెంగళూరుకు చేరుకుంది.
నవీన్ శేఖరప్ప
ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్ చదువుతున్న నవీన్.. ఖర్కీవ్ ప్రాంతంలో ఇరుదేశాల సైనికుల మధ్య జరిగిన పేలుళ్లలో మార్చి 1న ప్రాణాలు కోల్పోయారు. సోమవారం తెల్లవారుజామున నవీన్ మృతదేహం బెంగళూరు చేరుకుంది. నవీన్ పార్థివదేహానికి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నివాళులు అర్పించారు.
ఇదీ చూడండి :భుజాలపై కుమారుడి శవం.. గుండె నిండా దుఃఖం.. అర కిలోమీటరు నడుస్తూ...