Naval Dockyard Mumbai Recruitment 2023:భారత నావికాదళంలో చేరి దేశానికి సేవ చేయాలనుకుంటున్న యువతకు మంచి అవకాశం. నావల్ డాక్‌యార్డ్ ముంబయి 281 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ జూన్ 24లోపు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పింది.
అప్రెంటిస్ పోస్టుల వివరాలు
- ఫిట్టర్ - 42
- మాసన్ (BC) - 08
- I&CTCM - 03
- ఎలక్ట్రీషియన్ - 38
- ఎలక్ట్రానిక్స్ మెకానిక్ - 24
- ఎలక్ట్రోప్లాటర్ - 01
- మెకానిక్ (డీజిల్) - 32
- ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ - 07
- MMTM - 12
- మెషీనిస్ట్ - 12
- పెయింటర్ (జి) - 09
- పాట్రన్ మేకర్ - 02
- మెకానిక్ R&AC - 07
- షీట్ మెటల్ వర్కర్ - 03
- పైప్ ఫిట్టర్ - 12
- షిప్‌రైట్ (వుడ్) -17
- టైలర్ (జీ) - 03
- వెల్డర్ (G&E) - 19
నోట్ :పైన పేర్కొన్న పోస్టులన్నింటికీ ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ ఉంటుంది.
- రిగ్గర్ - 12
- ఫోర్జర్ & హీట్ ట్రీటర్ - 01
- షిప్‌రైట్ (స్టీల్) -16
నోట్ : పై పోస్టులకు రెండు సంవత్సరాల పాటు ట్రైనింగ్ ఉంటుంది.
విద్యార్హతలు?
అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణత అయ్యి ఉండాలి. NCVT ద్వారా గుర్తింపు పొందిన ఏదైనా సంస్థ నుంచి సంబంధిత ఐటీఐ ట్రేడ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. ముఖ్యంగా 65 శాతం మార్కులతో సంబంధిత ట్రేడ్ విభాగాలకు చెందిన ఐటీఐ ఎగ్జామ్ పాస్ అయ్యుండాలి.
రిగ్గర్ పోస్టులకు 8వ తరగతి, ఫోర్జర్ అండ్ హీట్ ట్రీటర్ ట్రేడ్‌కి 10వ తరగతి ఉత్తీర్ణత చాలు. వీరికి ఐటీఐ ఉత్తీర్ణత అవసరం లేదు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌లోని నోటిఫికేషన్‌ను చూడండి.
వయోపరిమితి
అభ్యర్థుల వయస్సు 14 ఏళ్ల నుంచి 21 ఏళ్ల మధ్యలో ఉండాలి. 2002 నవంబర్ 21 నుంచి 2009 నవంబర్ 21 మధ్యలో జన్మించి ఉండాలి.
కనీస భౌతిక ప్రమాణాలు
- ఎత్తు - 150 సెం.మీ.
- బరువు - 45 కేజీల కంటే తక్కువ ఉండరాదు
- ఛాతీ - ఊపిరి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ వెడల్పు కావాలి
- కంటి దృష్టి - 6/6 నుంచి 6/9 ఉండాలి.
దరఖాస్తు చేసుకోవడం ఎలా?
naval dockyard mumbai apprentice 2022 apply online : ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలి. పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్ https://apprenticedas.recttindia.in/ ను సందర్శించండి.
ఇవీ చదవండి :