అయోధ్యలో కొనసాగుతున్న శ్రీరామమందిర నిర్మాణంలో భాగంగా సోమవారం వేద మంత్రోచ్చారణల నడుమ నవగ్రహ ప్రతిష్ఠ జరిగింది. వీటితో పాటు వెండి కలశాలను కూడా ప్రతిష్ఠించారు.
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా, మరికొంతమంది ముఖ్య అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పునాదులు 40 అడుగుల మేర తవ్వారు. ట్రస్ట్ సభ్యుల సమాచారం మేరకు.. రామజన్మభూమి కాంప్లెక్స్ నిర్మాణం 44 పలకలుగా చేపట్టిన పునాదుల నిర్మాణంలో రెండు పలకలు ఇప్పటికి పూర్తి చేశారు.