తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశవ్యాప్తంగా రైల్​రోకో- పోలీసులపై రైతుల పూల వర్షం - వ్యవసాయ చట్టాల నిరసనలు

NATIONWIDE RAIL ROKO START FROM 12 NOON
నేడు దేశవ్యాప్తంగా అన్నదాతల 'రైల్​రోకో'

By

Published : Feb 18, 2021, 11:33 AM IST

Updated : Feb 18, 2021, 4:23 PM IST

16:19 February 18

ఉత్తర్​ప్రదేశ్ మోదీనగర్​లో భారతీయ కిసాన్ యూనియన్ సభ్యులు పోలీసు సిబ్బందిపై పూల వర్షం కురిపించారు. రైల్​రోకో ఆందోళనల్లో పాల్గొన్న రైతులు.. భద్రతా సిబ్బందికి మిఠాయిలు పంచిపెట్టారు. నిరసనను విరమించాలని అన్నదాతలను పోలీసులు అభ్యర్థించారు.  

యూపీలోని ఇతర ప్రాంతాల్లోనూ రైల్​రోకో విజయవంతంగా సాగుతోంది. హపుర్​లో రైల్వే ట్రాక్​పై భారీ సంఖ్యలో రైతులు బైఠాయించారు.  

మోదీనగర్​లో రైతుల నిరసనల వల్ల ఒడిశా పూరీ నుంచి ఉత్తరాఖండ్​లోని హరిద్వార్​కు వెళ్లే ఉత్కళ్ ఎక్స్​ప్రెస్ గాజియాబాద్ రైల్వే స్టేషన్ వద్ద నిలిచిపోయింది.  

12:58 February 18

రైల్​రోకోలో భాగంగా హరియాణాలో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పాల్వాల్​ రైల్వే ట్రాక్​పై నిరసనకు దిగారు. ఆందోళనకారుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున భద్రతా సిబ్బందిని మోహరించారు అధికారులు.

12:48 February 18

జమ్ముకశ్మీర్​లో రైల్​రోకోలో పాల్గొన్న మహిళా రైతులు

యునైటెట్ కిసాన్​ ఫ్రండ్ అధ్వర్యంలో జమ్ము కశ్మీర్​లో రైతులు రైల్​రోకో చేపట్టారు. చెన్నీ హిమత్​​ ప్రాంతంలో రైల్వే ట్రాక్​లపై నిరసనకు దిగారు. మహిళా రైతులూ రైల్​రోకోలో పాల్గొన్నారు.

12:13 February 18

రైతుల రైల్​రోకోకు మద్దతుగా బిహార్​లో జన్​ అధికార్ పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పట్నా రైల్వే జక్షన్​ వద్ద ట్రాక్​లపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. 

11:17 February 18

సాయంత్రం 4 గంటల వరకు దేశవ్యాప్తంగా రైల్‌రోకో

  • సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైల్‌రోకో
  • నాలుగు గంటలపాటు రైల్‌రోకోకు రైతుసంఘాల పిలుపు
  • మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు దేశవ్యాప్తంగా రైల్‌రోకో
  • దేశవ్యాప్తంగా రైళ్లను అడ్డుకోవాలని సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు
  • శాంతియుతంగా రైళ్లను నిలిపివేస్తామన్న రైతు సంఘాలు
  • నిలిచిన రైళ్లలోని ప్రయాణికులకు ఆహారం, నీరు సరఫరా
  • సాగు చట్టాల ఇబ్బందులను వివరిస్తామంటున్న రైతు సంఘాలు
  • రైల్‌రోకో దృష్ట్యా అప్రమత్తమైన రైల్వే అధికారులు
  • అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు
  • ఉత్తర భారతదేశంలో పలు రైళ్లు రద్దు, మరికొన్ని ఆలస్యం
  • 20 వేలకుపైగా అదనపు రైల్వే భద్రతా బలగాల మోహరింపు
  • పంజాబ్, యూపీ, హరియాణా, బంగాల్‌పై ప్రత్యేక దృష్టి
  • శాంతిభద్రతల పర్యవేక్షణకు కంట్రోల్ రూంలు ఏర్పాటు
  • అధికారులు అప్రమత్తంగా ఉండాలని రైల్వేశాఖ ఆదేశం
  • శాంతియుతంగా రైల్‌రోకో నిర్వహించాలని అధికారుల విజ్ఞప్తి
Last Updated : Feb 18, 2021, 4:23 PM IST

ABOUT THE AUTHOR

...view details