తెలంగాణ

telangana

ETV Bharat / bharat

NEET 2021 Results: 'నీట్‌' పరీక్షా ఫలితాలు విడుదల - నీట్​ ఫలితాల చూసుకోవడం ఎలా?

నీట్​ ఫలితాలను(NEET 2021 Results) విడుదల చేసింది జాతీయ పరీక్షల సంస్థ (NTA). వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం సెప్టెంబర్‌ 12న నీట్‌ పరీక్ష నిర్వహించినప్పటికీ ఫలితాల(NEET 2021 Results) విడుదలలో జాప్యం కొనసాగుతూ రావడంతో విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమైంది. దీనిపై సుప్రీంకోర్టు సైతం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.

NEET
నీట్‌

By

Published : Nov 1, 2021, 9:10 PM IST

Updated : Nov 1, 2021, 9:56 PM IST

దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న నీట్‌-యూజీ 2021 ఫలితాలు(NEET 2021 Results) ఎట్టకేలకు విడుదలయ్యాయి. ఫలితాల వెల్లడికి సుప్రీంకోర్టు గురువారం లైన్‌ క్లియర్‌ చేయడం వల్ల ఎన్‌టీఏ సోమవారం రాత్రి నీట్‌ ఫలితాలు ప్రకటించింది. సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించిన మరుసటి రోజే ఫైనల్‌ కీ, పరీక్ష ఫలితాలను విడుదల చేస్తారని విద్యార్థులు భావించారు. నాలుగు రోజులైనా ఫలితాలు వెల్లడించకపోవడంపై సామాజిక మాధ్యమాల వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ నేపథ్యంలో ఎన్‌టీఏ అధికారులు ఫలితాలు విడుదల చేశారు. ఫలితాలను http://neet.nta.nic.in/వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

తొలి ర్యాంకు వీరికే..

తెలంగాణకు చెందిన మృణాల్‌కుటేరి,దిల్లీకి చెందిన తన్మయ్‌ గుప్తా, మహారాష్ట్రకు చెందిన కార్తిక నాయర్‌కు మొదటిర్యాంకు వచ్చింది. సమాన మార్కులు వచ్చిన అందరికీ ఒకే ర్యాంకు ప్రకటించింది ఎన్‌టీఏ.

జాప్యంతో ఆందోళన..

మరోవైపు, వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం సెప్టెంబర్‌ 12న నీట్‌ పరీక్ష నిర్వహించినప్పటికీ ఫలితాల(NEET 2021 Results) విడుదలలో జాప్యం కొనసాగుతూ రావడంతో విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమైంది. ముంబయిలోని ఓ పరీక్షా కేంద్రంలో ఇద్దరు విద్యార్థుల ఓఎంఆర్‌ షీట్లు తారుమారైనందున వారికి మళ్లీ పరీక్ష నిర్వహించాలని, అంతవరకు ఫలితాల విడుదల నిలిపివేయాలంటూ బాంబే హైకోర్టు ఆదేశించింది. దీంతో ఫలితాల విడుదలలో జాప్యం కొనసాగుతూ వచ్చింది.

అయితే, బాంబే హైకోర్టు తీర్పుపై ఎన్‌టీఏ అధికారులు సుప్రీంకోర్టులో సవాల్‌ చేయగా.. కేవలం ఇద్దరి కోసం 16లక్షల మంది విద్యార్థుల ఫలితాలు ఆపలేమని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించిన ధర్మాసనం.. ఆ ఇద్దరి విద్యార్థుల విషయాన్ని దీపావళి సెలవుల అనంతరం నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. దీంతో ఇప్పటికే సిద్ధం చేసిన నీట్‌ 2021 ఫలితాలను అధికారులు సోమవారం రాత్రి విడుదల చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Nov 1, 2021, 9:56 PM IST

ABOUT THE AUTHOR

...view details