తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇజ్రాయెల్​ ఎంబసీ వద్ద 'ఎన్​ఎస్​జీ' తనిఖీలు

దిల్లీలోని ఇజ్రాయెల్​ రాయబార కార్యాలయం వద్ద పేలుడు ఘటన విచారణ నిమిత్తం ఎన్ఎస్‌జీ బృందం ఘటనాస్థలి వద్ద తనిఖీలు చేపట్టింది. ఆ ప్రాంతంలో గుర్తించిన ఓ సగం కాలిన వస్త్రంలోని మూటను ఫోరెన్సిక్ ల్యాబ్​కు పంపించారు.

national security guard team arrives israel embassy  to examine characteristics of explosives used
ఇజ్రాయిల్ ఎంబసీకి చేరుకున్న ఎన్ఎస్‌జీ బృందం

By

Published : Jan 30, 2021, 5:30 PM IST

Updated : Jan 30, 2021, 6:27 PM IST

దిల్లీ పేలుడు ఘటన విచారణలో భాగంగా ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఎస్‌జీ) తనిఖీలు చేపట్టింది. పేలుడు జరిగిన స్థలాన్ని అధికారులు పరిశీలించారు. ఘటనాస్థలంలో ఎరుపు రంగు వస్త్రంతో కట్టిన మూటను గుర్తించారు. ఆ మూటను ఫోరెన్సిక్​ కార్యాలయానికి తరలించారు.

మరోవైపు ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద జరిగిన పేలుడు పై పలువురు క్యాబ్ డ్రైవర్లను దిల్లీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ప్రశ్నించారు. ఉదయం నుంచి చాలా మంది క్యాబ్ డ్రైవర్లను విచారించారు. అయితే ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు లభించలేదని వెల్లడించారు.

బాంబు పేలిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న ఎన్​ఎస్​జీ అధికారులు
ఘటనా స్థలిలో ఎన్​ఎస్​జీ తనిఖీలు
ఘటనా స్థలంలో దొరికిన సగం కాలిన వస్త్రం

సీసీ కెమెరాల డేటా సేకరణ

పేలుడు జరగక ముందు రెండు గంటలు, జరిగిన తర్వాతి గంటకు సంబంధించిన సీసీ కెమెరాల డేటాను సేకరించారు పోలీసులు. ఆ సమయంలో రాకపోకలు సాగించిన క్యాబ్ డ్రైవర్లను ప్రశ్నించినట్లు తెలిపారు. పేలుడు సమయంలో ఇద్దరు అనుమానాస్పదంగా క్యాబ్ నుంచి దిగడం సీసీ కెమెరాలో గమనించామన్నారు. ఉబర్, ఓలా యాజమాన్యాల నుంచి సహకారం కోరారు.

ఇజ్రాయిల్ ఎంబసీకి చేరుకున్న ఎన్ఎస్‌జీ బృందం
ఎర్రకోట వద్ద క్రైం బ్రాంచ్​ అధికారులు
ఎర్రకోట తనిఖీల్లో క్రైం బ్రాంచ్ అధికారులు

మరోవైపు.. పేలుడుతో, ఎర్రకోట ఘటనలకు ఏవైనా సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా.. దిల్లీ క్రైం బ్రాంచ్ పోలీస్, ఫోరెన్సిక్ బృందం ఎర్రకోటకు వెళ్లి.. అక్కడి పరిసరాలను తనిఖీ చేశారు.

ఇదీ చదవండి :దిల్లీ పేలుడు కేసు ఎన్​ఐఏకు అప్పగింత!

ఇజ్రాయెల్​పై ప్రతీకారంతోనే దిల్లీలో పేలుడు!

Last Updated : Jan 30, 2021, 6:27 PM IST

ABOUT THE AUTHOR

...view details