దేశంలో వైద్య విద్య, ఆరోగ్య రంగంలో సరికొత్త మార్పులు తీసుకొస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ మేరకు జాతీయ వైద్య కమిషన్ పారదర్శకంగా పనిచేస్తోందన్నారు. వైద్య రంగంలో మానవ వనరులను పెంపొందిస్తున్నామని స్పష్టం చేశారు. కొత్త కళాశాలలను నెలకొల్పడానికి నిబంధనలను హేతుబద్ధం చేసినట్లు చెప్పారు. తమిళనాడులోని డాక్టర్ ఎమ్జీఆర్ మెడికల్ యూనివర్సిటీ 33వ స్నాతకోత్సవంలో దృశ్య మాధ్యమం ద్వారా పాల్గొన్నారు.
" శ్రీలంకలో డిక్ ఓయా వద్ద ఆసుపత్రి ప్రారంభోత్సవం నేను ఎప్పటికీ మరవలేను. అది ఎందరికో ఉపయోగపడుతోంది. శ్రీలంకలో ఉన్న తమిళ వర్గం కోసం చేసిన ఆ ప్రయత్నం.. ఎమ్జీఆర్ని సంతోషపెడుతుంది. శ్రీలంకలోని తమిళ వర్గానికి వైద్య రంగలో సేవ చేయడాన్ని భారత ప్రభుత్వం సదా గౌరవంగా భావిస్తోంది."
- ప్రధాని నరేంద్ర మోదీ