తెలంగాణ

telangana

ETV Bharat / bharat

National Judicial Data Grid Supreme Court : ఆన్​లైన్​లో సుప్రీంకోర్టు కేసుల డేటా.. చరిత్రాత్మకమన్న సీజేఐ - supreme court case status njdg

National Judicial Data Grid Supreme Court : కింది స్థాయి కోర్టుల నుంచి హైకోర్టుల వరకు కేసుల డేటా పొందుపరిచే పోర్టల్​ 'నేషనల్ జ్యుడిషియల్​ డేటా గ్రిడ్​' (ఎన్​జేడీజీ)కు సుప్రీంకోర్టును త్వరలో అనుసంధానిస్తామని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ డీవై చంద్రచూడ్ తెలిపారు. ఈ నిర్ణయంతో న్యాయవ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుందని అన్నారు.

national judicial data grid supreme court
national judicial data grid supreme court

By PTI

Published : Sep 14, 2023, 1:28 PM IST

Updated : Sep 14, 2023, 2:06 PM IST

National Judicial Data Grid Supreme Court : సుప్రీంకోర్టులో పెండింగ్ కేసులు, పరిష్కారమైన కేసుల వివరాలు ఇకపై ఆన్​లైన్​లో అందుబాటులో ఉండనున్నాయి. నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ పోర్టల్(ఎన్​జేడీజీ)​కు సుప్రీంకోర్టును త్వరలో అనుసంధానిస్తామని సీజేఐ జస్టిస్​ డీవై చంద్రచూడ్ గురువారం ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల న్యాయవ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుందని సీజేఐ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో ఇప్పటివరకు కింది స్థాయి కోర్టుల నుంచి హైకోర్టు డేటాను పొందుపరిచే ఎన్​జేడీజీ పోర్టల్​లో త్వరలో సుప్రీంకోర్టులకేసుల వివరాలు కూడా అందుబాటులోకి రానున్నాయి.

'ఇది చరిత్రాత్మకమైన రోజు. సుప్రీంకోర్టులో పెండింగ్, పరిష్కారమైన కేసుల వివరాలు త్వరలో ఎన్​జేడీజీ పోర్టల్​లో చూసుకోవచ్చు. సంవత్సరాలవారీగా పెండింగ్​లో ఉన్న కేసుల గురించి తెలుసుకోవచ్చు. ఎన్​జేడీజీలో సుప్రీంకోర్టు డేటాను అప్​లోడ్ చేయడం వల్ల న్యాయవ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుంది' అని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు.
దేశవ్యాప్తంగా ఉన్న దిగువస్థాయి కోర్టుల నుంచి హైకోర్టుల స్థాయి వరకు డేటా ఎన్​జేడీజీలో అందుబాటులో ఉంటుంది. ఇందులో పెండింగ్, పరిష్కారమైన కేసుల వివరాలు ఉంటాయి.

Supreme Court Sedition Law Case : రెండు రోజుల క్రితం (సెప్టెంబరు 12) భారత శిక్షాస్మృతిలోని రాజద్రోహం నిబంధనకు చట్టబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు.. ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. విస్త్రృత ధర్మాసనానికి బదిలీ చేసే నిర్ణయాన్ని వాయిదా వేయాలన్న కేంద్ర ప్రభుత్వ అభ్యర్థనను సుప్రీంకోర్టుప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ DY చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం తోసిపుచ్చింది. సంబంధిత పత్రాలను సీజేఐ ఎదుట ఉంచాలని.. తద్వారా రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుపై తదుపరి చర్యలు తీసుకుంటారని రిజిస్ట్రీని ఆదేశించింది.

IPC, CRPC, సాక్ష్యాధారాల చట్టాల స్థానంలో కొత్త చట్టాలను తీసుకొస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది. అందుకు సంబంధించిన బిల్లులు ప్రస్తుతం పార్లమెంటు స్థాయీసంఘం పరిశీలనలో ఉన్నట్లు గుర్తు చేసింది. అయితే కొత్త చట్టం అమల్లోకి వచ్చినప్పటికీ.. రాజద్రోహానికిసంబంధించిన 124A నిబంధన అమల్లో ఉన్నంత కాలం.. ఆ సెక్షన్‌ కింద విచారణ కొనసాగే అవకాశం ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఆ కోణంలో నిబంధనపై మదింపు జరగాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

Supreme Court On Religious Conversion : మతమార్పిళ్లను అడ్డుకోవాలని పిల్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Article 370 Supreme Court : ఆర్టికల్ 370 రద్దు పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్

Last Updated : Sep 14, 2023, 2:06 PM IST

ABOUT THE AUTHOR

...view details