తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భర్త కొట్టడం తప్పేమీ కాదంట- మెజార్టీ తెలుగు మహిళల మాట! - ఎన్‌హెచ్‌ఎఫ్‌ఎస్‌ లేటెస్ట్ సర్వే

National Family Health Survey: భార్యను భర్త కొట్టడం తప్పేమీ కాదని.. 14 రాష్ట్రాల్లో 30 శాతానికి పైగా మహిళలు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోనైతే.. ఏకంగా 84శాతం మంది మహిళలు అది తప్పు కాదని తెలిపారు.

National Family Health Survey
జాతీయ కుటుంబ సర్వే

By

Published : Nov 29, 2021, 7:33 AM IST

National Family Health Survey: కొన్ని పరిస్థితుల్లో భార్యను భర్త కొట్టడం తప్పేమీ కాదని దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో 30 శాతానికి పైగా మహిళలు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాల్లోనైతే ఇలాంటి మహిళల శాతం ఏకంగా 84శాతంగా ఉంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌హెచ్‌ఎఫ్‌ఎస్‌)-5 ఈ మేరకు వివరాలను బయటపెట్టింది. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో ఈ అంశంపై సర్వే నిర్వహించారు.

ఇందులో భాగంగా.. "భార్యను భర్త కొట్టడం మీ అభిప్రాయంలో సబబేనా?"అనే ప్రశ్నను మహిళల ముందుంచారు. భార్యకు వివాహేతర సంబంధం ఉందని అనుమానించడం, అత్తింటివారిని ఆమె గౌరవించకపోవడం, మొగుడితో వాదనకు దిగడం, భర్తతో శృంగారానికి నిరాకరించడం, ఆయనకు చెప్పకుండా బయటకు వెళ్లడం, ఇంటిని/పిల్లలను నిర్లక్ష్యం చేయడం, మంచి ఆహారాన్ని వండకపోవడం వంటి పరిస్థితులు తలెత్తినట్లు ఊహించుకొని సమాధానాలు చెప్పాలని వారికి సూచించారు.

సర్వేలో తేలిన ముఖ్యాంశాలివీ..

  • మూడు రాష్ట్రాల్లో 75శాతంపైగా మహిళలు.. భార్యను భర్త కొట్టడం సబబేనని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో వారి శాతం 84శాతంగా (సర్వేలో పాల్గొన్నవారిలో) ఉండగా.. కర్ణాటకలో 77శాతంగా నమోదైంది.
  • మణిపుర్‌ (66శాతం), కేరళ (52శాతం), జమ్మూ-కశ్మీర్‌ (49శాతం), మహారాష్ట్ర (44శాతం), బంగాల్‌ (42శాతం)ల్లోనూ మొగుడు చితకబాదడాన్ని సమర్థించే మహిళల సంఖ్య ఎక్కువగానే ఉంది.
  • ఇంటిని/పిల్లల్ని నిర్లక్ష్యం చేసినప్పుడు, అత్తింటివారిని గౌరవించనప్పుడు భార్యను భర్త కొట్టడం సమంజసమేనని అత్యధిక మంది మహిళలు అభిప్రాయపడ్డారు. అత్తింటివారిని గౌరవించకపోవడాన్ని ప్రధాన కారణంగా తెలంగాణ సహా 13 రాష్ట్రాల మహిళలు పేర్కొన్నారు.
  • అత్యల్పంగా హిమాచల్‌ ప్రదేశ్‌లో 14.8శాతం మహిళలు మొగుడు కొట్టడాన్ని సమర్థించారు.
  • భార్యను భర్త కొట్టడాన్ని.. మహిళలతో పోలిస్తే తక్కువ మంది పురుషులు సమర్థించడం కొసమెరుపు!

ఇదీ చూడండి:ఒక్కరోజులోనే అత్యాచార కేసు తీర్పు- దోషికి జీవితఖైదు

ABOUT THE AUTHOR

...view details