తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా నితీశ్ ఏకగ్రీవం - బిహార్ శాసనసభాపక్ష నేతగా నితీశ్ ఏకగ్రీవం

బిహార్ ఎన్డీఏ కూటమి శాసనసభాపక్షనేతగా నితీశ్ కుమార్ ఎన్నికయ్యారు. నితీశ్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ఎన్డీఏ పక్షాలు ఆయనను కూటమి నాయకుడిగా ఎన్నుకున్నాయి.

National Democratic Alliance meeting
కాసేపట్లో బిహార్ ఎన్డీఏ కూటమి భేటీ

By

Published : Nov 15, 2020, 1:43 PM IST

Updated : Nov 15, 2020, 2:08 PM IST

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీఏ కూటమి శాసనసభాపక్ష నేతగా జేడీయూ అగ్రనేత నితీశ్ కుమార్ ఎన్నికయ్యారు. నితీశ్ ఇంట్లో జరిగిన ఎన్డీఏ పక్షాల భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో నాలుగోసారి బిహార్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించే అవకాశం దక్కించుకున్నారు నితీశ్ కుమార్. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ సైతం హాజరయ్యారు.

ఎన్డీఏ కూటమి భేటీలో నితీశ్, రాజ్​నాథ్
సమావేశంలో ఎమ్మెల్యేలు
నితీశ్-రాజ్​నాథ్

ముఖ్యమంత్రిగా సోమవారమే నితీశ్ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఉపముఖ్యమంత్రిగా భాజపా నేత సుశీల్ కుమార్ మోదీ బాధ్యతలు చేపట్టనున్నారు.

ఎన్డీఏలో జేడీయూతో పాటు భాజపా, హిందుస్థానీ అవామీ మోర్చా(హెచ్​ఏఎం), వికాస్‌ శీల్ ఇన్సాన్(వీఐపీ) పార్టీలు ఉన్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్​డీఏ కూటమి విజయం సాధించగా.. భాజపా 74 సీట్లతో కూటమిలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. జేడీయూ 43 చోట్ల గెలుపొందింది. నితీశ్‌ కుమారే తమ ముఖ్యమంత్రి అభ్యర్థి అని తొలి నుంచి చెబుతున్న భాజపా.. తాజాగా లాంఛనంగా ఆయనను నాయకుడిగా ఎన్నుకుంది.

Last Updated : Nov 15, 2020, 2:08 PM IST

ABOUT THE AUTHOR

...view details