జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్ వేదికగా తెలిపారు.
"మా నాన్నకు కరోనా సోకింది. స్వల్ప లక్షణాలు ఉన్నాయి. కొవిడ్ పరీక్షలు చేయించుకున్న మా కుటుంబ సభ్యులంతా ఐసోలేషన్‌లో ఉంటారు. ఇటీవల మాతో సన్నిహితంగా ఉన్నవారు తగిన జాగ్రతలు తీసుకోండి."