తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దున్నపోతు @ రూ.10 కోట్లు.. రోజుకు 65 లీటర్ల పాలిస్తున్న ఆవు.. ధరెంతో తెలుసా? - national animal pair muzaffarnagar photos

ఉత్తర్​ప్రదేశ్​లో జాతీయ వ్యవసాయ ప్రదర్శనలో రూ. 10 కోట్ల దున్నపోతు, రోజు 65 లీటర్ల పాలిచ్చే హైబ్రిడ్​ ఆవు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ప్రదర్శన దేశవ్యాప్తంగా రైతులు, పశుకాపరులు తమ జంతువులతో వచ్చారు. రైతులకు పశుపోషణ, వ్యవసాయంలో వివిధ అంశాలపై సమాచారం అందించేందుకు 150 స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను గురువారం కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్​ గడ్కరీ ప్రారంభించారు.

national animal pair muzaffarnagar uttarpradesh
national animal pair muzaffarnagar uttarpradesh

By

Published : Apr 7, 2023, 10:07 AM IST

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో జరిగిన వ్యవసాయ ప్రదర్శనలో ఓ దున్నపోతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రూ. 10 కోట్ల విలువ గల ఓ దున్నపోతు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో ప్రదర్శనకు వచ్చిన వారంతా దీనిని ఆసక్తిగా తిలకించారు. అంతే కాకుండా రోజుకు 65 లీటర్ల పాలిచ్చే హైబ్రిడ్​ ఆవు కూడా మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఆవు రోజుకు మూడు సార్లు పాలు ఇస్తుందని దాని యజమాని తెలిపాడు. దీని ధర రూ.5 లక్షలకు పైగా ఉంటుందని చెప్పాడు. వీటితో పాటు ఈ ప్రదర్శనలో హరియాణాకు చెందిన ఆవులు, గేదెలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ప్రదర్శనను కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్​ గడ్కరీ గురువారం ప్రారంభించారు.

ఏప్రిల్​ 6,7 తేదీల్లో రెండు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనలో వివిధ రాష్ట్రాల నుంచి రైతులు వారి పశువులు తీసుకొచ్చారు. దేశం నలుమూలల నుంచి దాదాపు 1200 పశువులతో పాటు 50 వేల మంది రైతులు, పశుకాపరులు వచ్చారు. వీరితో పాటు పలువురు శాస్త్రవేత్తలు కూడా పాల్గొన్నారు. ఈ మేళాకు వచ్చే వారి కోసం అన్ని ఏర్పాటు చేశారు. పశువులు ఉండేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. దీంతో పాటు 150 స్టాళ్లను ఏర్పాటు చేసి.. రైతులకు పశుపోషణ, వ్యవసాయానికి సంబంధించిన తాజా సమాచారాన్ని అందిస్తున్నారు. అందులో 75 స్టాళ్లలో వ్యవసాయ యంత్ర సామాగ్రి, డ్రోన్లు, వ్యవసాయ అంకురాల గురించి సమాచారం అందిస్తున్నారు. 40 డెయిరీ, పశుపోషణ, 15 ఫిషరీస్​, 20 ఐసీఏఆర్ ​(ఇండియన్ కౌన్సిల్​ ఆఫ్​ అగ్రికల్చరల్​ రీసెర్చ్)కు సంబంధించిన స్టాళ్లు ఉంటాయి.

జాతీయ జంతు ప్రదర్శనకు వచ్చిన పశువులు
జాతీయ జంతు ప్రదర్శనకు వచ్చిన పశువులు

ఈ మేళాలో పశువులకు 18 కేటగిరీల్లో పోటీలు నిర్వహిస్తారు. అందులో గెలిచిన పశువుల కాపరులకు రూ.5 లక్షలు, రూ. 2 లక్షలు, రూ.లక్ష బహుమతులతో సత్కరిస్తారు. అలా మొత్తంగా రూ.50 లక్షలు బహుమతులకు కేటాయించారు. ఇక, బెస్ట్​ యానిమల్​ ప్రైజ్​ రూ.5 లక్షలుగా ఉంచారు. వీటితో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, కుస్తీ, కబడ్డీ పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో గెలిచిన వారికి మొత్తంగా రూ.1.5 లక్షల నగదు బహుమతి అందిస్తారు. వీటితో పాటు ఫ్యాషన్ మోడలింగ్, డాగ్ షో మాదిరిగానే.. ఈ ప్రదర్శన పాల్గొనే జంతువులు వేదికపై ర్యాంప్​వాక్‌ చేస్తాయి. నడక, జాతి, సామర్థ్యాన్ని బట్టి జంతువులను అంచనా వేస్తారు. ఇందుకోసం నిపుణులైన శాస్త్రవేత్తలు జ్యూరీలో ఉంటారు.

జాతీయ జంతు ప్రదర్శనకు వచ్చిన పశువులు

ABOUT THE AUTHOR

...view details