మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ఠాక్రేను ఉద్దేశించి కేంద్రమంత్రి నారాయణ్‌రాణె....చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. దేశానికి స్వాతంత్ర్యం ఏ ఏడాది వచ్చిందో తెలియని సీఎం ఉద్ధవ్ ఠాక్రేను చెంపదెబ్బ కొట్టేవాడినని కేంద్రమంత్రి రాణె ఇటీవల వ్యాఖ్యానించారు. రాణె వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన శివసేన కార్యకర్తలు పలుచోట్ల ఆందోళనకు దిగారు. నాసిక్‌లోని భాజపా కార్యాలయంపై రాళ్లురువ్వారు. నాసిక్‌సహా పలు ప్రాంతాల్లో శివసేన శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేశాయి.
శివసేన శ్రేణుల ఫిర్యాదుతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన నాసిక్ పోలీసులు.. కేంద్ర మంత్రి కోసం ఓ బృందాన్ని పంపినట్లు చెప్పారు. కేంద్ర మంత్రి ఎక్కుడున్నా.. కోర్టులో హాజరుపర్చనున్నట్లు నాసిక్ పోలీసు కమిషనర్ దీపక్ పాండే తెలిపారు. ఆ తర్వాత కోర్టు నిర్ణయం మేరకు నడుచుకుంటామని చెప్పారు.
'నేను సాధారణ వ్యక్తిని కాను'