Female pilot death: బాత్రూంలో గీజర్ నుంచి విషవాయువు లీకై మహిళా పైలట్ ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్ర నాశిక్‌లో ఈ ఘటన జరిగింది. గీజర్ కారణంగా నాశిక్‌లో 15 రోజుల వ్యవధిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం స్థానికుల్ని కలచివేసింది.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. మృతురాలి పేరు రష్మీ పరాగ్ గైధాని(49). ముంబయిలో ఎయిర్ ఇండియా సీనియర్ పైలట్‌గా పని చేస్తున్నారు. శనివారం స్నానం చేస్తుండగా గీజర్ నుంచి విషవాయువు లీక్ అయింది. దీంతో ఆమె బాత్రూంలోనే స్పృహ తప్పి పడిపోయారు. కుటుంబసభ్యులు హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి తరలించగా.. ఆమె అప్పటికే మరణించారని వైద్యులు ధ్రువీకరించారు. రష్మీ మృతితో ఆమె కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.