తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యువ ఇంజినీర్​​ నయా రికార్డ్ .. 43 రోజుల్లోనే బిల్డింగ్ నిర్మాణం.. ప్రపంచ రికార్డు సొంతం.. - ఇండియన్​ సివిల్​ ఇంజనీర్ అరుదైన ఘనత

భవన నిర్మాణంలో సరికొత్త రికార్డు​ సృష్టించాడు మహారాష్ట్రకు చెందిన ఓ సివిల్ ఇంజినీర్​. కేవలం 43 రోజుల్లోనే 8,415 చదరపు అడుగుల వైశాల్యం ఉన్న భవనాన్ని నిర్మించి ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు.

nashik engineer jaw dropping record
భవన నిర్మాణంలో సరికొత్త రికార్డ్

By

Published : Jan 11, 2023, 9:25 PM IST

Updated : Jan 12, 2023, 6:30 AM IST

యువ ఇంజినీర్​​ నయా రికార్డ్ .. 43 రోజుల్లోనే బిల్డింగ్ నిర్మాణం.. ప్రపంచ రికార్డు సొంతం..

మహారాష్ట్రకు చెందిన మయూర్ జైన్​​ అనే సివిల్​ ఇంజినీర్ అరుదైన ఘనత సాధించాడు. 100 రోజుల్లో నిర్మించాల్సిన భవనాన్ని​.. కేవలం 43 రోజుల్లోనే పూర్తి చేసి ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు. 5 మీటర్ల ఎత్తు, 8,415 చదరపు అడుగుల వైశాల్యం ఉన్న భవన నిర్మాణాన్ని 2022 నవంబర్​ 7న​ నాశిక్​లో ప్రారంభించాడు మయూర్​. ఈ నిర్మాణాన్ని 2022 డిసెంబర్​ 20వ తేదీకి పూర్తి చేశాడు.

సివిల్ ఇంజినీర్ మయూర్ జైన్

కేవలం 43 రోజుల్లోనే ఈ భవన నిర్మాణానికి కావలసిన స్థలాన్ని సర్వే చేయడం మొదలుకొని.. పిల్లర్స్, స్లాబ్స్​ వంటి పనులు పూర్తి చేసి వరల్డ్ రికార్డ్స్​ ఇండియాలో చోటు సంపాదించాడు మయూర్​ జైన్​. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి ఈ నిర్మాణాన్ని చేపట్టాడు. దీనికోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందించుకుని నిర్మాణం వేగవంతంగా పుార్తి అయ్యేలా చేసుకున్నాడు. ఈ నిర్మాణంలో జైన్​తో పాటుగా.. ప్రాజెక్ట్ మేనేజర్ రజత్ రాజ్‌కుమార్ భాగమయ్యారు. బిల్డింగ్​లో కాంక్రీట్ సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి ప్రత్యేక సెన్సార్​లను ఉపయోగించారు.

భవన నిర్మాణం
Last Updated : Jan 12, 2023, 6:30 AM IST

ABOUT THE AUTHOR

...view details