తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అమిత్ షా సాక్ష్యం.. నరోదాగామ్‌ కేసులో నిర్దోషులుగా 67 మంది - గోద్రా అల్లర్లు

గుజరాత్​లో అల్లర్లకు సంబంధించిన నరోదాగామ్​ కేసులో 67 మందిని అహ్మదాబాద్ ప్రత్యేక న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటించింది. ఈ తీర్పుతో మాజీ మంత్రి మాయ కొద్నానీ, బజరంగ్‌దళ్‌కు చెందిన భజరంగి సహా 67 మందికి ఊరట లభించింది.

naroda gam massacre case
నరోదాగామ్‌ కేసు తీర్పు

By

Published : Apr 20, 2023, 6:55 PM IST

Updated : Apr 20, 2023, 8:55 PM IST

గుజరాత్‌ అల్లర్లకు సంబంధించిన నరోదాగామ్‌ కేసులో మాజీ మంత్రి మాయ కొద్నానీ, బజరంగ్‌దళ్‌కు చెందిన భజరంగి సహా 67 మందిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఈ మేరకు అహ్మదాబాద్‌కు చెందిన ప్రత్యేక న్యాయస్థానం గురువారం తీర్పు ఇచ్చింది. నరోదా గామ్‌లో ఇళ్లకు నిప్పు పెట్టడం వల్ల 11 మంది మృతి చెందారు. ఈ కేసులో మొత్తం 86 మంది నిందితులు కాగా.. విచారణ సమయంలోనే 18 మంది చనిపోయారు.

2017లో బీజేపీ అగ్రనేత అమిత్‌ షా కోర్టుకు హాజరై.. మాజీ మంత్రి మాయ కొద్నానీ తరపున సాక్ష్యమిచ్చారు. 2002లో నరేంద్ర మోదీ సారథ్యంలోని గుజరాత్‌ ప్రభుత్వంలో మాయ కొద్నానీ మంత్రిగా ఉన్నారు. 97 మందిని ఊచకోత కోసిన నరోదా పాటియా కేసులోనూ మాయ కొద్నానీ దోషిగా తేలారు. 28 ఏళ్ల జైలు శిక్ష విధించగా.. ఈ తీర్పును గుజరాత్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఉన్నత న్యాయస్థానం ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

2002 ఫిబ్రవరి 27న గోద్రా అల్లర్లు జరిగిన మరుసటి రోజే రాష్ట్ర వ్యాప్తంగా బంద్​కు పిలుపునిచ్చారు. దీంతో 2022 ఫిబ్రవరి 28న అహ్మదాబాద్​లోని నరోదాగామ్​లో జరిగిన మత ఘర్షణల్లో 11 మంది చనిపోయారు. అల్లర్లు జరిగిన సమయంలో మాయ కొద్నానీ.. అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. దీంతో మాయ కొద్నానీ సహా మరికొందరిపై కేసు నమోదైంది. తాజాగా అహ్మదాబాద్‌కు చెందిన ప్రత్యేక న్యాయస్థానం.. మాజీ మంత్రి మాయ కొద్నానీ, బజరంగ్‌దళ్‌కు చెందిన భజరంగి సహా 67 మందిని నిర్దోషులుగా ప్రకటించింది.

గోద్రా అల్లర్లు..
2002 ఫిబ్రవరి 27న పంచమహాల్‌ జిల్లాలోని గోద్రా పట్టణంలో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌కు కొందరు దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో 59 మంది ప్రయాణికులు మృతి చెందారు. అనంతరం 2002 ఫిబ్రవరి 28న చెలరేగిన అల్లర్లలో రాష్ట్రవ్యాప్తంగా ఇద్దరు పిల్లలు సహా 17 మంది హత్యకు గురయ్యారు. ఈ హింసాకాండలో పాల్గొన్న 22 మందిని అరెస్టు చేసిన పోలీసులు వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసు విచారణలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేకపోవడం వల్ల న్యాయస్థానం వారిని ఈ ఏడాది జనవరి 25న నిర్దోషులుగా ప్రకటించింది. కేసులో దోషులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి వ్యతిరేకంగా పోలీసులు ఎలాంటి ఆధారాలు చూపకపోవడం వల్ల పంచమహల్‌ జిల్లాలోని హలోల్‌ అదనపు సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ హర్ష్‌ త్రివేది వారిని నిర్దోషులుగా ప్రకటించారు. మొత్తం 22 మందిలో 14 మంది మాత్రమే ప్రాణాలతో ఉన్నారు. మిగిలిన ఎనిమిది మంది కేసు విచారణలో ఉండగానే చనిపోయారని డిఫెన్స్ లాయర్ గోపాల్ సింగ్ సోలంకి తెలిపారు.

Last Updated : Apr 20, 2023, 8:55 PM IST

ABOUT THE AUTHOR

...view details