తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యూట్యూబ్​లో 2 కోట్ల సబ్​స్క్రైబర్లతో మోదీ రికార్డ్- ఎవరికీ అందనంత ఎత్తులో ప్రధాని

Narendra Modi Youtube Subscribers : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యధిక యూట్యూబ్​ ఛానల్​ సబ్​స్క్రైబర్లు కలిగిన నేతగా రికార్డు సాధించారు. ప్రస్తుతం మోదీ వ్యక్తిగత ఛానెల్​ సబ్​స్క్రైబర్ల సంఖ్య రెండు కోట్లు దాటింది. ఆయనకు దరిదాపుల్లో కూడా మరో నేత లేకపోవడం విశేషం.

Narendra Modi Youtube Subscribers
Narendra Modi Youtube Subscribers

By PTI

Published : Dec 26, 2023, 5:32 PM IST

Narendra Modi Youtube Subscribers :ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ప్రపంచంలోనే అత్యధిక యూట్యూబ్​ ఛానల్​ సబ్​స్క్రైబర్లు కలిగిన నేతగా మోదీ రికార్డు సాధించారు. ప్రస్తుతం మోదీ యూట్యూబ్​ ఛానెల్​కు 2 కోట్లకు పైగా సబ్​స్క్రిప్షన్లు ఉన్నాయి. వ్యక్తిగత యూట్యూబ్​ ఖాతాతో ఈ ఘనత సాధించిన ఏకైక ప్రపంచ నేత కూడా మోదీనే. సబ్​స్క్రైబర్లతో పాటు వ్యూస్​లోనూ మిగతా అందరి నేతలకు అందనంత దూరంలో నిలిచారు. సుమారు 450 కోట్ల వ్యూస్​తో మోదీ అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత 22.4 కోట్ల వ్యూస్​తో జెలెన్​స్కీ రెండో స్థానంలో నిలిచారు. మోదీ ఖాతా వ్యూస్​తో పోల్చుకుంటే ఇది దాదాపు 43 రెట్లు అధికం.

సబ్​క్స్రైబర్ల విషయంలో మోదీ తర్వాత బ్రెజిల్​ మాజీ అధ్యక్షుడు జైర్​ బోల్సోనారో రెండో స్థానంలో ఉన్నారు. ఆయనకు యూట్యూబ్​లో సుమారు 64 లక్షల మంది సబ్​స్క్రైబర్లు ఉన్నారు. ప్రధాని మోదీతో పోల్చుకుంటే ఇది మూడో వంతు కంటే తక్కువ. ఆ తర్వాత ఉక్రెయిన్​ అధ్యక్షుడు జెలెన్​స్కీ 11 లక్షలతో మూడో స్థానంలో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ 7.89 లక్షలు, ఈజిప్ట్​ అధ్యక్షుడు ఎర్డోగాన్​కు 3.16 లక్షల సబ్​స్క్రైబర్లు ఉన్నారు.

2007లో నరేంద్ర మోదీ గుజరాత్​ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ యూట్యూబ్​ ఛానెల్​ను ప్రారంభించారు. ప్రధాని మోదీకి సంబంధించిన మరో ఛానెల్​ యోగా విత్​ మోదీకి సైతం సుమారు 73,000 వేల సబ్​స్క్రైబర్లు ఉన్నారు. ఇక భారత్​ విషయానికొస్తే, మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్​ గాంధీకి 35 లక్షల సబ్​స్క్రైబర్లు ఉన్నారు. ఇది మోదీ సబ్​స్క్రైబర్లతో పోలిస్తే ఆరో వంతులో కొంచెం ఎక్కువ.

ట్విట్టర్​లో మోదీనే టాప్​
మరోవైపు, దేశంలో అత్యధికంగా సోషల్​ మీడియా ఫాలోవర్లు ఉన్న వ్యక్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనసాగుతున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్​సైట్​ X (ట్విట్టర్​)లో అత్యధిక ఫాలోవర్స్ జాబితాలో మొదటి రెండు స్థానాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నారు. మోదీ ట్విట్టర్​ ఫాలోవర్స్ సంఖ్య ఏకంగా 91.5 మిలియన్లు(9 కోట్ల 15 లక్షలు) ఉండగా.. ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంఓ) అధికారిక ట్విట్టర్ ఖాతాను 54 మిలియన్ల (5.4 కోట్ల) మంది ఫాలో చేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్విట్టర్ ఖాతాకు 33.7 మిలియన్ (3.37 కోట్ల మంది) ఫాలోవర్స్ ఉన్నారు. మూడో స్థానంలో ఉన్న ఉత్తర్​ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ ఫాలోవర్స్ సంఖ్య ఇటీవల 26 మిలియన్ (2.6 కోట్లు) దాటింది.

Yogi Adityanath Twitter Followers : పవర్​ఫుల్​ 'యోగి'.. మోదీ, షా తర్వాత ప్లేస్ ఆయనదే.. ఇదిగో కొత్త లెక్క!

Modi Whatsapp Channel : వాట్సాప్​ ఛానెల్​లోకి మోదీ ఎంట్రీ.. కొత్త పార్లమెంట్​లో ఫొటోతో పోస్ట్​

ABOUT THE AUTHOR

...view details