తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రాముడితో సమానంగా మోదీని చూస్తారు' - తీరథ్​ సింగ్​ రావత్​ మోదీ

హిందువుల దైవం రాముడితో సమానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రజలు త్వరలోనే చూస్తారని ఉత్తరాఖండ్​ సీఎం తీరథ్​ సింగ్​ రావత్​ పేర్కొన్నారు. రాముడు సమాజం కోసం పనిచేశాడని.. మోదీ కూడా అదే చేస్తున్నారని వెల్లడించారు.

narendra-modi-will-be-seen-at-par-with-lord-ram-uttarakhand-cm-tirath-singh-rawat
'రాముడితో సమానంగా మోదీని చూస్తారు'

By

Published : Mar 15, 2021, 9:45 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు ఉత్తరాఖండ్​ ముఖ్యమంత్రి తీరథ్​ సింగ్​ రావత్​. ప్రజలు రానున్న రోజుల్లో.. మోదీని రాముడితో సమానంగా చూస్తారని అభిప్రాయపడ్డారు.

"సమాజం కోసం రాముడు పనిచేశాడు. అప్పుడే ఆయన దేవుడని ప్రజలు విశ్వసించారు. ఇప్పుడు మోదీ కూడా సమాజం కోసం ఎంతో చేస్తున్నారు. రానున్న రోజుల్లో.. ప్రజలు మోదీని రాముడితో సమానంగా చూస్తారు."

- తీరథ్​ సింగ్​ రావత్​, ఉత్తరాఖండ్​ సీఎం

ఉత్తరాఖండ్​ ముఖ్యమంత్రిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టారు తీరథ్​ సింగ్​. అసమ్మతి నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్​ రావత్​.. పదవికి రాజీనామా చేయగా.. భాజపా హైకమాండ్​ మద్దతుతో తీరథ్​ ఆ బాధ్యతలు చేపట్టారు.

ఇదీ చూడండి:-కుంభమేళా భక్తులపై హెలికాప్టర్​తో పూలవర్షం!

ABOUT THE AUTHOR

...view details