Narendra Modi Pune Visit : విపక్ష కూటమిలో కీలక నేత ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో వేదికను పంచుకోవడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. మహారాష్ట్ర పుణెలో జరిగిన లోకమాన్య తిలక్ వర్ధంతి కార్యక్రమం ఇందుకు వేదికైంది. ఈ సందర్భంగా 'ది తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్' (హింద్ స్వరాజ్ సంఘ్) అనే సంస్థ ప్రకటించిన లోక్మాన్య తిలక్ నేషనల్ అవార్డును అందుకున్నారు ప్రధానమంత్రినరేంద్ర మోదీ. ఈ కార్యక్రమానికి ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌ను ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వీరితో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే సహా కాంగ్రెస్, శివసేన(ఉద్దవ్ వర్గం) నేతలు పాల్గొన్నారు. అంతకుముందు లోకమాన్య తిలక్‌కు నివాళులు అర్పించారు ప్రధాని మోదీ.
అవార్డు బహుమానాన్ని 'నమామీ గంగే' ప్రాజెక్ట్‌కు విరాళం
లోకమాన్య తిలక్ జాతీయ అవార్డు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. ఈ అవార్డు ద్వారా వచ్చిన ప్రైజ్‌మనీని నమామీ గంగే ప్రాజెక్ట్‌కు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ అవార్డును 140 కోట్ల భారతీయులకు అంకింతం ఇస్తున్నానని చెప్పారు. ఆ తర్వాత పుణెలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పుణె మెట్రో ఫేజ్ 1లో పూర్తైన రెండు కారిడార్లను మోదీ జెండా ఊపి ప్రారంభించారు.
"తిలక్లాంటి గొప్ప పోరాట యోధుని అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. పత్రికా స్వేచ్ఛ ప్రాముఖ్యాన్ని తిలక్ బాగా అర్థం చేసుకున్నారు. ఆయన భారత స్వాతంత్ర్య పోరాటంలో ముందుడి నడిచారు. ఉద్యమ గమనాన్ని మార్చేశారు. యువతలోని నైపుణ్యాన్ని గుర్తించడంలో తిలక్ ప్రత్యేక స్థానం ఉంది. అందుకు ఉదాహరణ వీర్ సావర్కర్. విదేశాల్లో విద్య విషయంలో కీలక పాత్ర పోషించిన ఆయనను గుర్తించింది తిలక్. కొంత మంది విదేశీ అక్రమణదారుల పేర్లు మార్చితే కొందరు అసహనానికి గురవుతున్నారు."
--నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి