తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని, రాష్ట్రపతి - పీఎం మోదీ

Narendra Modi greetings: దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి కోవింద్​. ఈ ఏడాది ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందాన్ని తీసుకురావాలని ట్వీట్​ చేశారు మోదీ.

PM MODI
ప్రధాని నరేంద్ర మోదీ

By

Published : Jan 1, 2022, 7:31 AM IST

Updated : Jan 1, 2022, 8:47 AM IST

Narendra Modi greetings: దేశ ప్రజలకు ఆంగ్ల సంవత్సరారంభం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. . ఈ సంవతర్సరం అందరి జీవితాల్లో ఆనందాన్ని తీసుకురావాలని, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ట్వీట్​ చేశారు.

" ఈ ఏడాది ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందాన్ని, మంచి ఆరోగ్యాన్ని తీసుకురావాలి. అభివృద్ధి, శ్రేయస్సులో కొత్త శిఖరాలను చేరుకునేందుకు, మన స్వాతంత్ర్య సమరయోధుల కలలను నెరవేర్చడానికి మరింత కష్టపడి పనిచేద్దాం."

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

రాష్ట్రపతి శుభాకాంక్షలు..

నూతన సంవత్సరం సందర్భంగా దేశంతోపాటు విదేశాల్లో నివసిస్తున్న భారతీయులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. "నూతన సంవత్సర కొత్త ఉషస్సు మన జీవితాల్లో శాంతి, శ్రేయస్సు, సౌభ్రాతృత్వ స్ఫూర్తిని పునరుజ్జీవింపజేయాలని ఆకాంక్షిస్తున్నాను. మన సమాజం, దేశంలో పురోగతికి నాంది పలికే యత్నాలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికేలా సంకల్పిద్దాం" అని కోవింద్‌ ఓ ప్రకటనలో సందేశమిచ్చారు. ఈ నూతన ఏడాది ప్రజలకు ఆయురారోగ్యాలను, విజయ సంబరాలను, ఆనందోత్సాహాలను అందించాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:నూతన సంవత్సర వేడుకలతో హోరెత్తిన నగరాలు

Last Updated : Jan 1, 2022, 8:47 AM IST

ABOUT THE AUTHOR

...view details