తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కాస్త రెస్ట్ తీసుకో తమ్ముడూ!'.. ప్రధాని మోదీకి అన్న సలహా - గుజరాత్ ఎన్నికలు 2022

తన సోదరుడు సోమభాయ్ మోదీని కలిసి మాట్లాడారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. గుజరాత్​ రెండో దశ ఎన్నికల్లో ఓటు వేయడానికి అహ్మదాబాద్​ వచ్చిన మోదీ.. సమీపంలో ఉన్న సోదరుడి నివాసానికి వెళ్లి కాసేపు మాట్లాడారు.

gujarat election 2022
gujarat election 2022

By

Published : Dec 5, 2022, 2:40 PM IST

గుజరాత్​ రెండో దశ ఎన్నికల్లో భాగంగా ఓటు వేయడానికి వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. తన అన్న సోమభాయ్​ మోదీని కలిశారు. తొలుత అహ్మదాబాద్ రాణిప్​​లోని నిషాన్​ పబ్లిక్ స్కూల్​లో ఏర్పాటు చేసిన పోలింగ్​ కేంద్రంలో ఓటు వేసిన మోదీ.. సమీపంలో ఉన్న సోదరుడి నివాసానికి వెళ్లారు. సోదరుడు నరేంద్ర మోదీతో మాట్లాడిన సోమభాయ్​ మోదీ భావోగ్వేదానికి గురయ్యారు. దేశం కోసం ఆయన(ప్రధానమంత్రి నరేంద్ర మోదీ) చాలా కష్టపడి పనిచేశారని.. కొంత విశ్రాంతి తీసుకోవాలని తాను సూచించానని సోమభాయ్​ మోదీ తెలిపారు. దేశాభివృద్ధికి పాటుపడిన పార్టీకే ఓటు వేయాలని ప్రజలను కోరారు. 2014 తర్వాత దేశంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని ఓటు వేసిన పోలింగ్​ కేంద్రంలోనే ఓటు వేశారు సోమభాయ్ మోదీ.

ఓటు వేసిన ప్రధానమంత్రి సోదరుడు

వీల్​ఛైర్​పై వచ్చి ఓటేసిన ప్రధాని మోదీ తల్లి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్​ మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గాంధీనగర్​లోని రాయ్​సన్​ ప్రైమరీ స్కూల్​లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి వీల్​ఛైర్​లో వచ్చి ఓటేశారు. అంతకుముందు ఆదివారం గాంధీనగర్​లోని తన తల్లి నివాసానికి వెళ్లి ఆమె ఆశీస్సులు తీసుకున్నారు ప్రధాని మోదీ. అనంతరం తల్లి ఇచ్చిన టీ సేవించి ఆమెతో కాసేపు ముచ్చటించారు. ఆ సమయంలో ప్రధాని చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు.

ఓటు వేసిన ప్రధానమంత్రి తల్లి

నడుచుకుంటూ వెళ్లి.. క్యూలో నిల్చుని ఓటేసిన మోదీ
అంతకుముందు అహ్మదాబాద్​ పరిధిలో ఉన్న రాణిప్​ నిషాన్​ స్కూల్​లో ఓటు హక్కును వినియోగించుకున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ పాదయాత్రగా పోలింగ్​ కేంద్రానికి వచ్చారు. సాధారణ ఓటర్లలాగే వరుసలో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ప్రధాని. అనంతరం మాట్లాడిన మోదీ.. పోలింగ్​ను ప్రశాంతంగా నిర్వహించారంటూ ఎన్నికల సంఘాన్ని ప్రశంసించారు. ప్రజాస్వామ్య ఉత్సవంలో పాల్గొన్న గుజరాత్​, హిమాచల్​ ప్రదేశ్, దిల్లీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు ప్రజలందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ముఖ్యంగా యువత, మహిళలు అధిక సంఖ్యలో ఓటింగ్​లో పాల్గొనాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చూసేందుకు ఉదయాన్నే వచ్చామని స్థానికులు చెప్పారు. మోదీని చూస్తే గర్వంగా ఉంటుందని.. మొదట మోదీని చూసిన తర్వాతే ఓటు వేశామని తెలిపారు.

ఇవీ చదవండి:ఓటేసిన ప్రధాని మోదీ.. నడుచుకుంటూ వెళ్లి, క్యూలో నిల్చుని..

గుజరాత్​లో రెండో దశ పోలింగ్​ ప్రారంభం​.. ఓటు వేసిన ప్రధాని, సీఎం, షా

ABOUT THE AUTHOR

...view details