Narendra Modi Ayodhya Ram Mandir : ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య రాముడి విగ్రహా ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆహ్వాన పత్రిక పంపినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. 2024 జనవరిలో అట్టహాసంగా జరగనున్న ఈ వేడుకలకు హాజరు కావాలని మోదీకి లేఖ పంపించినట్లు.. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ పేర్కొన్నారు. ఉత్సవాల కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వివరించారు. దాదాపు 10వేల మంది కూర్చునేలా వేదికలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
అయోధ్య రామయ్య విగ్రహ ప్రతిష్ఠాపనకు మోదీకి ఆహ్వానం.. అట్టహాసంగా కార్యక్రమం - అయోధ్య రామమందిరం మోదీ
Ayodhya Ram Mandir Modi : ప్రధాని నరేంద్ర మోదీని.. అయోధ్యలో రాముడి విగ్రహా ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఆహ్వానించారు నిర్వాహకులు. 2024 జనవరిలో జరిగే ఈ వేడుకలకు సంబంధించి మోదీకి ఆహ్వాన పత్రిక పంపారు. ఉత్సవాల కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు.

దేశంలోని ప్రతి దేవాలయాలు, గ్రామాలను కార్యక్రమంలో పాల్గొనేలా ఏర్పాటు చేస్తున్నట్లు చంపత్ రాయ్ పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో అయోధ్య రాముడి విగ్రహా ప్రతిష్ఠాపన హోర్డింగ్‌లు కడతామని ఆయన వెల్లడించారు. అయోధ్యతో పాటు క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమాలను నిర్వహించేలా.. ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. జనవరి 15 నుంచి 24 వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయని చంపత్ రాయ్ వెల్లడించారు. వేడుకల హాజరు కావాలని ప్రధానమంత్రిని కోరినట్లు ఆయన వివరించారు. ఉత్సవాలకు భారీగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని.. అందుకోసం.. పరిసర ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు.
జనవరిలో అయోధ్య ఆలయ ప్రతిష్ఠ!.. హోటళ్లు, రిసార్ట్‌లు హౌస్‌ఫుల్..
Ayodhya Ram Mandir Inauguration : అయోధ్యలో రామాలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 15-24 మధ్య జరిగే రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపనను తిలకించేందుకు భక్తులు సమాయత్తం అవుతున్నారు. ఆ అపూర్వ ఘట్టాన్ని చూసేందుకు తహతహలాడుతున్న భక్తులు.. ఇప్పుడే పెద్దఎత్తున హోటళ్లు, రిసార్ట్‌లు, హోమ్‌స్టేలు బుక్ చేసుకుంటున్నారు. లక్షల్లో ప్రజలు తరలివచ్చే అవకాశాలున్నాయని హోటళ్ల యజమానులు చెబుతున్నారు. ట్రావెల్ ఏజెన్సీల ద్వారా తమను సంప్రదించే వారు 10, 12 రోజులు ఉండేలా గదులు బుక్ చేసుకుంటున్నారని తెలిపారు. దిల్లీ, మహారాష్ట్ర, ఇతర మెట్రో నగరాల నుంచి ఎక్కువగా సంప్రదిస్తున్నారని వివరించారు. ముంబయికి చెందిన ఓ ట్రావెల్ ఏజెన్సీ.. వారం పాటు 15వేల గదులు కావాలని అడిగినట్లు ఓ రిసార్ట్ ప్రకటించింది. పూర్తి కథనం కోసం ఇక్కడి క్లిక్ చేయండి.