తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహంత్​ అనుమానాస్పద మృతిపై సీబీఐ ఛార్జిషీటు

మహంత్​ నరేంద్ర గిరి (Narendra Giri death) మృతి కేసులో ఆయన శిష్యుడు ఆనంద్ గిరి సహా మరో ఇద్దరిపై సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసింది. మహంత్ ఆత్మహత్యకు పాల్పడేలా వారు ప్రేరేపించారని పేర్కొంది.

Narendra Giri death
మహంత్ ఆత్మహత్య కేసు

By

Published : Nov 20, 2021, 6:17 PM IST

మహంత్​ నరేంద్ర గిరి (Narendra Giri death) అనుమనాస్పద మృతి కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) దర్యాప్తు ముమ్మరం చేసింది. శనివారం మహంత్​ శిష్యుడు ఆనంద్​ గిరి సహా మరో ఇద్దరిపై ఛార్జిషీటు(Cbi charge sheet) నమోదు చేసింది.

అలహాబాద్​లోని కోర్టులో అభియోగపత్రాన్ని సీబీఐ దాఖలు చేసింది. ఆనంద్ గిరితో పాటు అలహాబాద్​ బడే హనుమాన్ ఆలయ పూజారి ఆధ్య తివారీ, అతని కుమారుడు సందీప్​ పేర్లను అందులో చేర్చింది. నేరపూరిత కుట్రతో పాటు మహంత్​ నరేంద్ర గిరి ఆత్మహత్యకు పాల్పడేలా వారు ప్రేరేపించినట్లు పేర్కొంది.

అఖిల భారతీయ అఖాడా పరిషత్​​ అధ్యక్షుడైన మహంత్​ నరేంద్ర గిరి సెప్టెంబరు 20న తన నివాసంలో అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. ఆయన మరణం ఆత్మహత్యగా భావించిన పోలీసులు.. ఘటనాస్థలం నుంచి సూసైడ్​ నోట్​ను స్వాధీనం చేసుకున్నారు. ఆనంద్​ గిరి తనను మానసికంగా వేధించాడని నరేంద్ర గిరిలో లేఖలో పేర్కొన్నారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details