తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆరోపణల్ని నిరూపించాలని నారాయణ స్వామి సవాల్​' - షా వ్యాఖ్యలపై మండిపడ్డ నారాయణ సామి

కేంద్ర హోం మంత్రి అమిత్​ షా వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి నారాయణ స్వామి. భాజపా ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ భారీ అవినీతికి పాల్పడిందని.. ప్రభుత్వ నిధులను అక్రమంగా గాంధీ కుటుంబానికి తరలించారంటూ షా ఆరోపించారు. అయితే.. ఈ ఆరోపణల్ని నిరూపించాలని, లేని పక్షంలో పరువు నష్టం దావా వేస్తానని నారాయణ స్వామి హెచ్చరించారు.

Narayanasamy
'షా.. ఆ ఆరోపణల్ని నిరూపించాలని నారాయణ సామి సవాల్​'

By

Published : Mar 1, 2021, 4:05 PM IST

పుదుచ్చేరిలో భాజపా ఎన్నికల ర్యాలీ సందర్భంగా.. కేంద్ర హోం మంత్రి అమిత్​ షా చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు మాజీ సీఎం నారాయణ స్వామి. షా.. తనపై చేసిన ఆరోపణల్ని రుజువు చేయాలని సవాల్​ విసిరారు. లేనిపక్షంలో ఆయనపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఫిబ్రవరి 28న భాజపా ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణ స్వామి, కాంగ్రెస్​పై తీవ్ర విమర్శలు చేశారు షా. కేంద్ర ప్రభుత్వ పథకాలకు కేటాయించిన నిధుల్లో రూ.15వేల కోట్ల సొమ్మును.. నారాయణ స్వామి అక్రమంగా గాంధీ కుటుంబానికి తరలించారని ఆరోపించారు.

"ప్రధాని మోదీ ప్రభుత్వ పథకాల కింద రూ.15వేల కోట్లను పంపారని షా అన్నారు. ఇది చాలా తీవ్రమైన అంశం. షా వ్యాఖ్యలు.. నాతో పాటు గాంధీ కుటుంబ పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా ఉన్నాయి. దీన్ని ఆయన రుజువు చేయాలి. అలా నిరూపించలేకపోతే ఆయనపై పరువు నష్టం దావా కేసు వేయాల్సి ఉంటుంది."

- వి.నారాయణ స్వామి, పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి

అమిత్ షా తనపై చేసిన ఆరోపణల్ని రుజువు చేయకపోతే.. తనతో పాటు పుదుచ్చేరి ప్రజలకూ క్షమాపణలు చెప్పాలని డిమాండ్​ చేశారు నారాయణ స్వామి.

పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ వేడి రాజుకుంది. శాసనసభలో.. అధికార కాంగ్రెస్​ మెజారిటీ పడిపోవడం వల్ల.. గతనెల 23న నారాయణ స్వామి సీఎం పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​.. ఆయన రాజీనామాను ఆమోదించారు. అనంతరం అక్కడ ఫిబ్రవరి 25 నుంచి రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది.

ఇదీ చదవండి:పుదుచ్చేరి స్పీకర్ శివకొలుందు​ రాజీనామా

ABOUT THE AUTHOR

...view details