తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నారదా స్టింగ్'​ కేసులో టీఎంసీ మంత్రుల అరెస్టు

'నారదా స్టింగ్' కేసులో టీఎంసీ మంత్రులైన ఫిర్హాద్​ హకీం, సుబ్రతా ముఖర్జీ, ఎమ్మెల్యే మదన్​ మిత్రా సహా మాజీ మేయర్​ సోవన్​ ఛటర్జీని కేంద్ర దర్యాప్తు సంస్థ ( సీబీఐ) సోమవారం అరెస్టు చేసింది. వీరి అరెస్టు వార్త తెలుసుకున్న బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు.

CBI
'నారదా స్టింగ్'​ కేసు

By

Published : May 17, 2021, 12:25 PM IST

Updated : May 17, 2021, 1:04 PM IST

'నారదా స్టింగ్'​ కేసులో బంగాల్​ మంత్రులు ఫిర్హాద్​ హకీం, సుబ్రతా ముఖర్జీ, ఎమ్మెల్యే మదన్​ మిత్రా సహా మాజీ మేయర్​ సోవన్​ ఛటర్జీని కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) సోమవారం అరెస్టు చేసింది. కోల్​కతాలో వీరిని అదుపులోకి తీసుకుంది. ఓ సంస్థ నుంచి డబ్బులు తీసుకుంటుండగా కెమెరాలో చిక్కారనే ఆరోపణలు ఈ నేతలపై ఉన్నాయి. వీరిపై సీబీఐ అభియోగపత్రం నమోదు చేయనుందని అధికారులు తెలిపారు.

నిజామ్​ ప్యాలెస్​లోని సీబీఐ కార్యాలయానికి ఈ నలుగురు నేతలు.. సోమవారం ఉదయం చేరుకున్నారు. వీరి అరెస్టు వార్త.. మీడియాలో ప్రసారమైన కాసేపటికి.. సీబీఐ కార్యాలయానికి బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా చేరుకున్నారు. 2014లో మంత్రులుగా ఉన్న ఈ నలుగురు నేతలపై విచారణకు అనుమతిస్తూ.. ఆ రాష్ట్ర గవర్నర్​ జగదీప్ ధన్​కర్​ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు.

బంగాల్​లో ఇటీవల ముగిసిన ఎన్నికల్లో హకీం, ముఖర్జీ, మిత్రా మళ్లీ ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. కాగా.. టీఎంసీని వీడి భాజపాలో చేరారు సోవన్​ ఛటర్జీ.

అసలేంటీ కేసు..

మాథ్యూ శామ్యూల్​ ఆధ్వర్యంలోని నారదా టీవీ ఛానల్​.. 2014లో ఓ స్టింగ్​ ఆపరేషన్​ నిర్వహించింది. ఇందులో టీఎంసీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఓ డొల్ల కంపెనీ నుంచి డబ్బులు తీసుకున్నట్లు తేలింది. 2016 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ వీడియో టేపులు బహిర్గతమయ్యాయి. ఈ అంశంపై దర్యాప్తు బాధ్యతలను 2017లో సీబీఐకి అప్పగిస్తూ కలకత్తా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చూడండి: 'దేశ ప్రజలను కష్టాల్లోకి నెట్టిన మోదీ'

ఇదీ చూడండి:ఆకలి కోరల్లో అభాగ్యులు

Last Updated : May 17, 2021, 1:04 PM IST

ABOUT THE AUTHOR

...view details