వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో లోకశ్ పై వైసీపీ కార్యకర్త కోడిగుడ్డుతో దాడిచేశారు. అయితే ఆ గుడ్డు లోకేష్ కు తగలకుండా పక్కనే ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి తగిలాయి. దీంతో సెక్యూరిటీ అప్రమత్తం అయింది. ప్రొద్దుటూరు శివాలయం సెంటర్‌లో బహిరంగ సభ ముగించుకుని ఆర్టీసి బస్టాండ్ దాటి న తరువాత ఓ దుకాణం వద్ద ఆగి ప్రజలతో మాట్లాడుతుండగా గుడ్ల దాడి జరిగింది. ఈ గుడ్లు సెక్యూరిటిపై పడటంతో వారు అప్రమత్తమయ్యారు. ప్రొద్దుటూరులో లోకేష్ యువగళం సందర్భంగా పోలీసు సెక్యూరిటీ ఉన్నప్పటికీ దాడి జరగడంపై టిడిపి వర్గాలు పోలీసుల వైఫల్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసుల సెక్యూరిటీపై లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేశ్‌పై కోడిగుడ్డు వేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అప్రమత్తం కావడంతో రిలయన్స్ పెట్రోల్ బంక్ నుంచి యువగళం పాద యాత్ర కొనసాగింది.
Eggs Attack on Nara Lokesh: నారా లోకేశ్‌పై కోడిగుడ్డు విసిరిన ఆకతాయి... దేహశుద్ది చేసిన టీడీపీ కార్యకర్తలు - Nara Lokesh eggs attack
Nara Lokesh eggs attack
22:14 June 01
నారా లోకేశ్‌పై కోడిగుడ్డు విసిరిన ఆకతాయి
Last Updated : Jun 1, 2023, 10:52 PM IST