Nara Lokesh on Chandrababu Health: అనారోగ్య కారణాలతో తెలుగుదేశం అధినేత చంద్రబాబును అంతమొందించే కుట్ర జరుగుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ.. చంద్రబాబును రిమాండ్‌లోనే ఉంచాలనే కుట్ర జరుగుతోందని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు జీవితం ప్రమాదంలో ఉంది. భద్రతలేని జైలులో చంద్రబాబు ఆరోగ్యం క్షీణించేలా చేసి ప్రాణహాని తలపెడుతున్నారు.
ఏ తప్పూ చేయని చంద్రబాబు పట్ల వైసీపీ ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఆరోగ్యంపై జైలు అధికారుల తీరు సందేహాస్పదంగా ఉందని.. చంద్రబాబుకు ఏ హాని జరిగినా.. జగన్ ప్రభుత్వం, జైలు అధికారులదే బాధ్యత అని పేర్కొన్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై ఎందుకీ కక్ష? అని లోకేశ్ ప్రశ్నించారు.
Chandrababu's Health in Jail : జైలులో చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యుల ఆందోళన
జైలులో దోమలు ఎక్కువ ఉన్నాయన్నా అధికారులు పట్టించుకోలేదని.. చన్నీళ్లు ఇస్తున్నారనన్నా లెక్క చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిగా తిరగని ఫ్యాన్ పెట్టారని.. చంద్రబాబు బరువు తగ్గిపోయారని.. అలర్జీ వచ్చిందని తెలిపారు. డీ హైడ్రేషన్‌కు గురయ్యారని అన్నారు. జైలు పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని’ అని లోకేశ్ మండిపడ్డారు.
Mulakat with Chandrababu: కాగా నారా లోకేశ్ దిల్లీ నుంచి విజయవాడ చేరుకున్నారు. గన్నవరం నుంచి రోడ్డు మార్గాన రాజమహేంద్రవరానికి చేరుకున్నారు. టీడీపీ క్యాంపు కార్యాలయంలో కాసాని జ్ఞానేశ్వర్, బుచ్చయ్య, చినరాజప్ప, జవహర్‌తో లోకేశ్ సమావేశమయ్యారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఇవాళ ములాఖత్‌కు కుటుంబసభ్యుల ప్రయత్నిస్తున్నారు. ములాఖత్ కోసం జైలు అధికారులను సంప్రదిస్తున్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబుతో కుటుంబసభ్యుల ములాఖత్ కానున్నారు.
Chandrababu Illness In Jail: ఎండవేడిమి, ఉక్కపోతతో చంద్రబాబుకు అలర్జీ.. వైద్య పరీక్షలు
Family Members Worrying about Chandrababu Health: ఇప్పటికే.. ప్రభుత్వం, జైలు అధికారుల తీరుపై.. లోకేశ్, భువనేశ్వరి, బ్రాహ్మణి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు జైలుకి వెళ్లినప్పటి నుంచి ఆయన ఆరోగ్యంపై మొదటనుంచీ పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎండ వేడిమి కారణంగా డీహైడ్రేషన్‌కు గురికావడంతో పాటు.. ఆయన శరీరంపై పలుచోట్ల దద్దుర్లు రావటం, అలర్జీతో బాధపడుతున్నారు. అయితే దీనిపై ప్రభుత్వ పెద్దలు స్పందించిన తీరుపై అనుమానాలు నెలకొన్నాయి. చంద్రబాబు గురించి తెలుగుదేశం పార్టీ నేతలు మొదటి నుంచి ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
దీనిపై ప్రభుత్వం సరైన రీతిలో స్పందించలేదు. అదే విధంగా కొందరు మంత్రులు, ప్రభుత్వ సలహాదారు సజ్జల హేళన చేస్తూ మాట్లాడిన సందర్భాలూ ఉన్నాయి. దీంతో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, బ్రాహ్మణి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జైల్లో తన భర్తకు అత్యవసర వైద్యాన్ని సకాలంలో అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని నారా భువనేశ్వరి మండిపడ్డారు. స్టెరాయిడ్లు ప్రయోగించడానికి ప్రభుత్వం యత్నిస్తోందని నారా లోకేశ్ ఆరోపించగా.. చంద్రబాబు ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని లోకేశ్ సతీమణి బ్రాహ్మణి అన్నారు.
Chandrababu to Rajamahendravaram Hospital: చంద్రబాబును ఆసుపత్రికి తరలించనున్నారా..? అర్ధరాత్రి వీఐపీ గది సిద్ధం చేసింది అందుకేనా..?