తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Nara Brahmani Tweet I am with babu : 'ఆంధ్రా భవిష్యత్ కోసం నేను సైతం..' నారా బ్రాహ్మణి కీలక ప్రకటన! - ఏపీ ముఖ్యవార్తలు

Nara Brahmani Tweet I am with babu : చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ.. టీడీపీ శ్రేణులు ఆందోళన కొనసాగిస్తుండగా మరోవైపు పార్టీలు, ప్రాంతాలకతీతంగా మద్దతు వెల్లువెత్తుతోంది. హైదరాబాద్, బెంగళూరులో ఐటీ ఉద్యోగులు ఇప్పటికే నిరసన తెలపగా.. I Am With Babu హ్యాష్ ట్యాగ్ వైరల్ అయ్యింది. ఈ క్రమంలో నారా బ్రాహ్మణి చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది.

nara_brahmini_tweet_i_am_with_babu
nara_brahmini_tweet_i_am_with_babu

By ETV Bharat Telugu Team

Published : Sep 15, 2023, 6:16 PM IST

Updated : Sep 15, 2023, 7:18 PM IST

Nara Brahmani Tweet I am with babu : స్కిల్ డెవలప్​మెంట్ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా మద్దతు వెల్లువెత్తుతోంది. ఓ వైపు టీడీపీ శ్రేణులు ఆందోళన కొనసాగిస్తుండగా.. ధర్నాలు, దీక్షలు హోరెత్తుతున్నాయి. హైదరాబాద్, బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు విధులు బహిష్కరించి రోడ్ల మీదకు రాగా.. మరోవైపు ఇంజినీరింగ్ విద్యార్థులు సైతం బాబుకు మద్దతుగా కదులుతున్నారు. ఆందోళన ఉద్యమంగా రూపాంతరం చెందుతున్న తరుణంలో I Am With CBN హ్యాష్ ట్యాగ్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నారా బ్రాహ్మణి ట్వీట్..భవిష్యత్ తరాలను కాపాడటానికి బాబుతో నేను అంటూ నారా బ్రాహ్మణి ట్వీట్ (Nara Brahmani tweet) చేశారు. చంద్రన్న పెళ్లికానుక ద్వారా లబ్ధిపొందిన దంపతులు రాజమండ్రి వరకూ వెళ్లి మద్దతు తెలపగా.. వారి కుమారుడు అనిత్ కుమార్.. నేను సైతం అంటూ చంద్రబాబు, లోకేశ్​కు మద్దతు ప్రకటించడంపై ఆనందం వ్యక్తం చేశారు. చిన్నారి అనిత్ కుమార్ మాటలు ఎంతో ముద్దొచ్చాయన్న బ్రాహ్మణి... ఆ సందర్భాన్ని ట్విటర్ (Twitter) వేదికగా పంచుకున్నారు. '2024లో చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే వరకూ పోరాడుతూనే ఉంటాం. తను సమస్యల్లో ఉన్నా ప్రజా సమస్యల కోసం పోరాడుతున్న చంద్రబాబు, నారా లోకేశ్​కు నా హృదయ పూర్వక అభినందనలు' అని చెప్పడం విశేషం.

Police Raided Colleges in Vijayawada: విజయవాడలో పోలీస్ బంద్.. ఇంజినీరింగ్ కళాశాలలకు బలవంతపు సెలవు.. విద్యార్ధులకు హెచ్చరికలు

పవన్ కల్యాణ్, బాలకృష్ణ పరామర్శ... రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న చంద్రబాబుతో ములాఖత్ కోసం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఈనెల 14న హైదరాబాద్‌ నుంచి రాజమండ్రి చేరుకున్నారు. సోదరి భువనేశ్వరి, కుమార్తె బ్రహ్మణిని పరామర్శించారు. చంద్రబాబు అరెస్టుపై విచారం వ్యక్తం చేసిన ఆయన... కేవలం రాజకీయ కక్షలో ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan), టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌(Nara Lokesh) తోనూ భేటీ అయ్యారు. చంద్రబాబుతో ములాఖత్ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో పరాజయం తప్పదన్న భయంతోనే జగన్.. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని, 16 రోజులైనా చంద్రబాబును జైలులో పెట్టాలన్నదే జగన్‌ కుట్ర అని బాలకృష్ణ తెలిపారు. రాష్ట్ర భవిష్యత్ కోసం ప్రతిఒక్కరూ ఉద్యమించాల్సిన తరుణం ఇదే అని చెప్పారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చంద్రబాబు (Chandrababu)ను పరామర్శించారు. నారా లోకేశ్ బస చేసిన ఇంటికి చేరుకుని అక్కడ చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, నారా బ్రాహ్మణిను పరామర్శించి ఓదార్చారు.

Bangalore People and IT Employees Agitation Against CBN Arrest: చంద్రబాబుకు మద్దతుగా బెంగళూరులో ఆందోళన.. "బాబుతో నేను" అంటూ ప్లకార్డులు

ఐటీ ఉద్యోగుల ఆందోళన... చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా హైదరాబాద్​లో ఆందోళనకు దిగిన సాప్ట్ వేర్​ ఉద్యోగులు (Software employees).. గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్ వద్ద నిరసన తెలిపారు. 'I Am With CBN' ప్లకార్డులతో ఉద్యోగులు ధర్నా చేశారు. విప్రో సర్కిల్​లో జరిగిన ఈ నిరసనలో వేలాదిగా పాల్గొన్న ఐటీ ఉద్యోగులు.. 'సైకో పోవాలి - సైకిల్ రావాలి' అంటూ నినదించారు. చంద్రబాబుకు మద్దతుగా బెంగళూరు ప్రజలు, ఐటీ ఉద్యోగులు ఆందోళకు పూనుకున్నారు. 'ఐటీ అంటే బాబు.. లూటీ అంటే జగన్‌' ఈ సందర్భంగా తెలుగు ఐటీ ఉద్యోగులు నినదించారు.

IT Employees Protest TDP Chief Chandrababu Arrest : చంద్రబాబు అరెస్టుకు నిరసనగా హైదరాబాద్​లో ఐటీ ఉద్యోగుల ఆందోళన

Last Updated : Sep 15, 2023, 7:18 PM IST

ABOUT THE AUTHOR

...view details