Nara Bhuvaneshwari Nijam Gelavali Yatra: నేటి నుంచి భువనేశ్వరి 'నిజం గెలవాలి' యాత్ర.. చంద్రగిరి నియోజకవర్గం నుంచి కార్యక్రమానికి శ్రీకారం.. Nara Bhuvaneshwari Nijam Gelavali Yatra: ప్రజా క్షేత్రంలో వరుస కార్యక్రమాలు నిర్వహించేలా తెలుగుదేశం కార్యాచరణ సిద్ధం చేసింది. అందులో భాగంగా చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో చనిపోయిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానుల కుటుంబాలను.. అధినేత సతీమణి నారా భువనేశ్వరి నేటి నుంచి పరామర్శిస్తారు. 'నిజం గెలవాలి' యాత్ర(Nijam Gelavali Yatra) ద్వారా వారానికి మూడు రోజుల పాటు మృతుల కుటుంబాల ఇంటింటికీ వెళ్లి పరామర్శించటంతో పాటు స్థానికంగా జరిగే సభలు, సమావేశాల్లోనూ పాల్గొంటారు.
Bhuvaneshwari Bus Yatra: మొదట రాయలసీమ జిల్లాల్లో ఈ పర్యటన సాగనుంది. చంద్రబాబుపై రాజకీయ కక్ష సాధింపుతోనే కేసు పెట్టారని, అసత్య ఆరోపణలతో జైల్లో పెట్టారనే విషయాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లి పోరాటాన్ని ఉద్ధృతం చేసే దిశగా.. 'నిజం గెలవాలి' కార్యక్రమం సాగనుంది. దాదాపు 47రోజులుగా జైల్లో ఉంటున్న చంద్రబాబుకు మద్దతుగా(Protests on Chandrababu Arrest) రోడ్డెక్కిన ప్రజలకు, ఆయా వర్గాల వారికి భువనేశ్వరి ధన్యవాదాలు తెలపనున్నారు.
Nara Bhuvaneshwari Visit to Tirumala: రేపటినుంచి 'నిజం గెలవాలి' బస్సుయాత్ర.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారా భువనేశ్వరి
TDP Nijam Gelavali Yatra: కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి ధైర్యం చెప్పడంతోపాటు అండగా ఉంటామంటూ భరోసా ఇవ్వనున్నారు. ఇవాళ చంద్రగిరి నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లోభువనేశ్వరి పాల్గొంటారు. బాబు అరెస్టును తట్టుకోలేక.. పాకాల మండలం నేండ్రగుంట గ్రామానికి చెందిన కె.చిన్నబ్బ సెప్టెంబర్ 25న, చంద్రగిరికి చెందిన ఎ.ప్రవీణ్‌రెడ్డి ఈ నెల 17న ప్రాణాలు కోల్పోయారు(Chandrababu Fans Death). వారి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తారు.
Nijam Gelavali Yatra Will Start From Today: తర్వాత చంద్రబాబు అరెస్టును(Chandrababu Arrest) నిరసిస్తూ అగరాలలో చేపట్టిన 'నిజం గెలవాలి' కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున మహిళలు భాగస్వాములు కానున్నారు. అలాగే గురువారం తిరుపతి, శుక్రవారం శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో కార్యక్రమం సాగనుంది. యాత్రకు ముందు తిరుమల శ్రీవారిని భువనేశ్వరి దర్శించుకున్నారు(Bhubaneswari Visited Tirumala Temple). తర్వాత స్వగ్రామం నారావారిపల్లెలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు పెట్టిన ఆమె.. చంద్రబాబు లేకుండా తొలిసారి తిరుమల వెళ్లానని.. ఈ ప్రయాణం భారంగా ఉందని తెలిపారు.
TDP Nijam Gelavali Program: 'నిజం గెలవాలి' పేరుతో ప్రజాక్షేత్రంలోకి నారా భువనేశ్వరి
Nijam Gelavali Yatra Start From Chandragiri Constituency: ఎప్పుడూ కుటుంబ సభ్యులతో ఊరు వచ్చే తాను.. చంద్రబాబు జైల్లో ఉన్న కారణంగా ఒంటరిగా నారావారిపల్లె వెళ్లానని తెలిపారు. ఈ ప్రయాణం తనకు ఎంతో బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నిమిషం భారంగా గడిచిందన్న భువనేశ్వరి.. ఆ ఏడుకొండల వాడి దయతో, మా ఊరు నాగాలమ్మ తల్లి కృపతో, ప్రజల మద్దతుతో.. నిజం గెలుస్తుందని నమ్ముతున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే చంద్రగిరిలో తొలి అడుగు వేస్తున్నట్లు స్పష్టం చేశారు.
Nijam Gelavali Yatra: మరోవైపు చంద్రబాబు అరెస్టుతో నిలిచిన 'బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారంటీ' కార్యక్రమాన్ని(Babu Surety Bhavishyathuku Gurantee Program) నవంబరు 1నుంచి లోకేశ్ పునరుద్ధరించనున్నారు. తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టోలో భాగంగా ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలకు..(Super Six Schemes) జనసేన(Janasena) చేసిన సిఫార్సులను జోడించి నవంబర్ 1 న ఐక్య కార్యాచరణ ప్రకటించి, ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. చంద్రబాబు బయటకు వచ్చేవరకు లోకేశ్(Nara Lokesh) ఈ కార్యక్రమాన్ని కొనసాగించనుండగా మిగిలిన నేతలు డిసెంబరు 15వరకు చేపడతారు. బాబు జైలు నుంచి బయటకు వచ్చాక యువగళం పాదయాత్ర(Nara Lokesh Yuvagalam Padayatra)ను ఆపేసిన చోటనుంచి ప్రారంభిస్తారు.
Bhuvaneshwari Fires on Police Behavior Against TDP Leaders: టీడీపీ శ్రేణులపై పోలీసు నిర్బంధం తీవ్ర ఆవేదన కలిగిస్తోంది: భువనేశ్వరి