బంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి ఇవాళ ఎన్నిక జరుగుతున్న నందిగ్రామ్ నియోజకవర్గంలోనే రోజంతా ఉండనున్నారు. పోలింగ్ తీరును సమీక్షించనున్నారు. ఉత్తర బంగాల్‌లో ప్రచారం కోసం వెళ్లాల్సి ఉన్నప్పటికీ.. ఆమె నిర్ణయం మార్చుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పోలింగ్ ముగిసేవరకు ఇక్కడే రేయపాడా ప్రాంతంలోని పార్టీ వార్ రూమ్‌లో ఉండి పర్యవేక్షిస్తారని, అవసరమైతే ఓటింగ్ కేంద్రాలకు వెళతారని ఓ సీనియర్ నేత తెలిపారు.
నందిగ్రామ్‌లో భాజపా అభ్యర్థి సువేందు అధికారితో తలపడుతున్నారు మమత. ఈ కీలక స్థానంలో హోరాహోరీ పోరు జరుగుతోంది. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఇక్కడ పోలింగ్ జరుగుతోంది.
'ఏజెంట్లనూ అనుమతించట్లేదు'